రాష్ట్రపతి భవన్ లో పోలీస్ అధికారికి కరోనా: పలువురు క్వారంటైన్ కు

By narsimha lode  |  First Published May 18, 2020, 11:18 AM IST

రాష్ట్రపతి భవన్ లో సీనియర్ పోలీస్ అధికారికి కరోనా సోకింది. 58  ఏళ్ల ఏసీపీ స్థాయి అధికారి రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 
కరోనా సోకిన ఏసీపీ స్థాయి అధికారితో  సన్నిహితంగా మెలిగిన మరికొందరు పోలీసు అధికారులు, సిబ్బందిని కూడ క్వారంటైన్ కు తరలించారు.
 


న్యూఢిల్లీ:రాష్ట్రపతి భవన్ లో సీనియర్ పోలీస్ అధికారికి కరోనా సోకింది. 58  ఏళ్ల ఏసీపీ స్థాయి అధికారి రాష్ట్రపతి భవన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 
కరోనా సోకిన ఏసీపీ స్థాయి అధికారితో  సన్నిహితంగా మెలిగిన మరికొందరు పోలీసు అధికారులు, సిబ్బందిని కూడ క్వారంటైన్ కు తరలించారు.

ఈ నెల 15వ తేదీ వరకు అతను విధులు నిర్వహించినట్టుగా అధికారులు చెప్పారు. శనివారం నాడు ఆయన అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తే కరోనా సోకినట్టుగా  తేలింది. 

Latest Videos

మే  13వ తేదీన ఏసీపీకి కరోనా సోకినట్టుగా గుర్తించారు అధికారులు. అతడితో సన్నిహితంగా ఉన్న వారిని కూడ ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించారు అధికారులు. మే 13వ తేదీ నుండి ఏసీపీని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నామని అధికారులు తెలిపారు. 

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: కావడిలో పిల్లలను మోస్తూ 160 కి.మీ. కాలినడకనే ఇంటికి

గత నెలలో కూడ ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండడంతో 115 కుటుంబాలను ఐసోలేషన్ లో ఉంచారు. కరోనాపై పోరులో రాష్ట్రపతి కోవింద్ కూడ తన వంతు సహాయాన్ని అందించాడు. 

తన జీతంలో 30 శాతం కోత విధించుకొన్నాడు. ఈ 30 శాతం డబ్బులను పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్టుగా రాష్ట్రపతి ప్రకటించారు.వ‌చ్చే ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రపతి వినియోగం కోసం ప‌ది కోట్ల విలువైన విలాస‌వంత‌మైన లిమోసిస్ కారు కొనుగోలును వాయిదా వేశారు. 

click me!