''ఆచార్య' కాలేజీలో చేరండి ... మీ బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకొండి''

By Arun Kumar P  |  First Published Apr 8, 2024, 11:19 AM IST

ఆచార్య విద్యాసంస్థలు నేటి యువతకు బంగారు భవిష్యత్ ను అందిస్తున్నాయి. విద్యారంగానికి, వ్యాపార రంగానికి మధ్యన వారధిగా నిలుస్తూ యువ నాయకులను తయారుచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యార్థులను తీర్చుదిద్దుతోంది ఆచార్య.  


స్కూల్ దశనుండి కాలేజీ మారే సమయం విద్యార్థుల జీవితంలో చాలా కీలకమైనది. వారు జీవితంలో ఏం సాధించాలో నిర్ణయం తీసుకునే సమయమిది. కాబట్టి కాలేజీకి చేరుతున్నామన్న ఉత్సాహమే కాదు ఓ రకమైన అనిశ్చితి కూడా యువతలో వుంటుంది. ఉన్నత చదువుల దగ్గరకు వచ్చేసరికి మరింత కన్ప్యూజన్ ఏర్పడుతుంది. ఈ దశలో ఏ మార్గంలో వెళ్లాలి... ఎలాగైతే మంచి అవకాశాలు వస్తాయి అనేది తెలుసుకోవడం విద్యార్థులకు చాలా ముఖ్యం. అయితే సరైన కాలేజీని ఎంచుకుంటే చాలు విద్యార్థుల భవిష్యత్ బంగారమే... అలాంటి విద్యాసంస్థే ఆచార్య. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్ అందిస్తూ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొంటూ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతుంది. ఇలా కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఆచార్య ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నతస్థాయికి చేరుకునేలా అత్యుత్తమ విద్య అందిస్తోంది.  

Latest Videos

భారతదేశంలో ఉన్నత విద్యను అందించే విద్యాసంస్థలు దాదాపు 36,000 పైగా వున్నట్లు ఓ నివేదిక చెబుతోంది. అయితే విద్యార్థులను తీర్చిదిద్దడంలో చాలా విద్యాసంస్థలు సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. కానీ ఆచార్య విద్యాసంస్థలు మాత్రం సాంప్రదాయ విద్యావ్యవస్థకు స్వస్తి పలికి సరికొత్త బోధనా పద్దతులను అవలంభిస్తోంది. ఇక్కడ అందించే కోర్సులు విద్యార్థులకు డిగ్రీలు అందించడమే కాదు మంచి ఉద్యోగాన్ని పొందేందుకు సమాయత్తం చేస్తాయి.   

 

 

 
1. ఉన్నత ప్రమాణాలతో కూడా సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్...

బెంగళూరులోని ఆచార్య ఇంజనీరింగ్ కాలేజీ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాలు కలిగివుంది. గూగుల్, ఎల్&టి, స్లెమెన్స్, ఐబిఎం, ఎడబ్యూఎస్, తోర్న్టన్ సంస్థలతో కలిసి ఆచార్య సర్టిపైడ్ కోర్సులను నిర్వహిస్తోంది. ఇలా తమ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడమే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. ప్రముఖ కంపనీల సహకారంతో చేసే కోర్సులు భవిష్యత్ లో విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు పొందేందుకు, పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.  


2. ఇంటర్న్ షిప్ మరియు ఉద్యోగ అవకాశాలు : 

విద్యార్థులకు అకడమిక్ విద్యను అందిస్తూనే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇంటర్న్ షిప్ సదుపాయం కల్పిస్తోంది ఆచార్య. ఇక కాలేజీ నుండి ఉద్యోగంతోనే బయటకు వెళ్లేలా ప్లేస్ మెంట్స్ నిర్వహిస్తోంది. ప్రముఖ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు పోటీ ప్రపంచం ఎలా వుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు
వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ఆచార్య ఇంజనీరింగ్ కాలేజీకి ప్రతి ఏడాది 550 కి పైగా కార్పోరేట్ సంస్థలు వస్తున్నాయి... విద్యార్థులకు తమ కంపనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ప్లేస్ మెంట్స్ కోసం కూడా విద్యార్థులను ముందుగానే సన్నద్దం చేస్తున్నారు. 


3. ల్యాప్ టాప్ తో కూడిన విద్య :

నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే సాంకేతిక విద్య చాలా అవసరం. దీన్ని గుర్తించిన ఆచార్య ల్యాప్ టాప్స్ ద్వారా సాంకేతిక విద్యను  అందిస్తోంది. విద్యార్థుల ఎంచుకున్న కోర్సును బట్టి వారికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరమో ఆ దిశగా నడిపిస్తున్నాం. విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్న ల్యాప్ టాప్స్ లో వారికి అవసరమైన సాప్ట్ వేర్స్ వుంటాయి. ఇంటర్నెట్ కోసం హైస్పీడ్ వైఫై సదుపాయం కూడా కల్పిస్తున్నాం. తద్వారా విద్యా సంబంధిత విషయాలు తెలుసుకునేందుకు, ఆన్ లైన్ ద్వారా తగిన నాలెడ్జ్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాం.  ఇలా విద్యార్థులకు డిజిటల్ విద్యకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోంది ఆచార్య. 


4. కోర్సేరా ప్లాట్ ఫామ్ : 

ఆచార్య విద్యాసంస్థ కోర్సేరా ఫ్లాట్ పామ్ ద్వారా విద్యార్థులకు మరో అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ ఫాట్ ఫామ్ తో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు 11000 కు పైగా ఆన్ లైన్ కోర్సులు, సర్టిఫికెట్స్, ప్రంపచస్థాయి యూనివర్సిటీలు,  విద్యాసంస్థల నుండి నేర్చుకునే సదుపాయం వుంటుంది. తద్వారా విద్యార్థులు నైపుణ్యాలు మెరుగుపడటంతో పాటు నేటి పోటీ ప్రపంచానికి తగినట్లు అప్ డేట్ గా వుండవచ్చు. ఇలా ఆచార్య విద్యార్థుల ప్రొపెషనల్ డెవలప్ మెంట్ కు క‌ృషిచేస్తోంది. 

5. అకడమిక్స్ తో పాటే ఇంకా ఎన్నో : 

సాధారణంగా అన్ని విద్యాసంస్థలు అకడమిక్ విద్యను అందిస్తాయి... కానీ ఆచార్య మాత్రం అంతకు మించి చేస్తోంది.  120 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలు కల్పించింది. విద్యార్థులకు మెరుగైన అత్యాధునిక ల్యాబ్స్ వున్నాయి. క్రీడల్లో రాణించాలనే విద్యార్థులకు కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. అందుకు తగిన సదుపాయాలు కూడా ఆచార్య క్యాంపస్ లో వున్నాయి. ప్లడ్ లైట్స్ తో కూడిన 10 వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన స్టేడియం, 20కి పైగా క్రీడా పరికరాలు వున్నారు. దీంతో చాలామంది విద్యార్థులు క్రీడల్లో రాణించి యూనివర్సిటీ స్థాయిలో విజయాలు సాధించారు. ఇక NCC ద్వారా దేశ సేవ చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఈ కాలేజీ ఎన్సిసి క్యాడెట్ ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా పాల్గొన్నారు. 

ఇక ఆచార్య హబ్బా వంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి కృషిచేస్తోంది. ఇది బెంగళూరులో నిర్వహించే అతిపెద్ద ఇంటర్ కాలేజ్ ఫెస్ట్.  12000పైగా విద్యార్థులు, 1000 కి పైగా ప్రముఖ అధ్యాపకులతో సహా ప్రముఖ  కంపనీలు ఇందులో భాగస్వామ్యమై విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తాయి.   

6. ఆచార్య హాస్టల్స్ విద్యార్థులకు మరో ఇళ్లు :

ఆచార్య హాస్టల్స్ విద్యార్థులకు అత్యుత్తమ సదుపాయాలు కల్పిస్తోంది. పరిశుభ్రతతో కూడిన వంటశాల, మంచినీటి సదుపాయం, వైఫై, సెక్యూరిటీ, బ్యాకప్ సదుపాయాలను విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఇక విద్యార్థులు అనారోగ్యం బారినపడితే క్యాంపస్ లోనే వైద్యం అందించేలా ఏర్పాట్లున్నాయి. అలాగే ఇంట్లోనే వుండి చదువుకుంటున్నామని అనుకునేలా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తోంది ఆచార్య.  

మొత్తంగా చూసుకుంటే ఆచార్య సాధారణ విద్యాసంస్థ కాదు... విద్యార్థులను అకడమికల్ గా, ప్రొఫెషనల్ గా తీర్చిదిద్దే ప్రాంతం.  విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి వారిలోని టాలెంట్ ను బయటకు తీస్తుంది. వారు ఏ రంగంలో రాణించగలరో గుర్తించి ఆ దిశగా నడిపిస్తుంది. ఇలా విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతూ దేశంలోనే ప్రముఖ కాలేజీగా పేరు తెచ్చుకుంది. 

https://admissions.acharya.ac.in/utm_source=asianet&utm_medium=articleఆచార్య కాలేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం +91 740-6644-449 నెంబర్ కు సంప్రదించండి లేదంటే వెబ్ సైట్ ను పరిశీలించండి. 


 

click me!