బాలికపై లైంగిక వేధింపులు.. శిక్షగా మలం తినిపించారు

Siva Kodati |  
Published : Nov 29, 2020, 06:22 PM ISTUpdated : Nov 29, 2020, 06:23 PM IST
బాలికపై లైంగిక వేధింపులు.. శిక్షగా మలం తినిపించారు

సారాంశం

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. 

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే కారణంతో ఓ వ్యక్తిని స్థానికులు తీవ్రంగా హింసించడంతో పాటు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. అతనిని చితక బాదటమే కాకుండా, బలవంతంగా మలం తినిపించారు .

వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌ రాష్ట్రం ధోల్‌పూర్‌కు చెందిన దీపక్‌ అనే వ్యక్తి కొన్ని వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 25వ తేదీన దీపక్‌పై ఎనిమిది మంది దాడికి పాల్పడ్డారు. 

పిడిగుద్దులు కురిపించడంతో పాటు చేతికి ఏది దొరికితే దానితో విచక్షణా రహితంగా చితకబాది, అతడి చేత మలం తినిపించారు. ఈ అమానుషకాండపై దీపక్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా బాలిక కుటుంబం గతంలోనే అతడిపై ఫిర్యాదు చేసిందని, దానిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?