రైలులో మహిళా పోలీసుపై దాడి నిందితుడు ఎన్‌కౌంటర్‌లో మృతి..

By SumaBala BukkaFirst Published Sep 22, 2023, 11:32 AM IST
Highlights

గత నెలలో అయోధ్య సమీపంలోని సరయూ ఎక్స్‌ప్రెస్‌లో మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. 

లక్నో : గత నెలలో రైలులో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఎన్‌కౌంటర్‌లో అతను చనిపోయినట్లు గుర్తించామని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఎదురు కాల్పుల్లో అతని ఇద్దరు సహాయకులు కూడా తీవ్రంగా గాయపడ్డారని, వారి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

అయోధ్య సమీపంలోని సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన ఓ మహిళా కానిస్టేబుల్ ముఖం, తలపై గాయాలతో..  రక్తపు మడుగులో  కనిపించింది. ప్రస్తుతం ఆమె లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడిలో ప్రధాన నిందితుడైన అనీస్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 

కారు డ్రైవర్ కి పట్టిన అదృష్టం.. అకౌంట్ లో రూ.9వేల కోట్లు జమా.. కానీ అంతలోనే....

ఎన్‌కౌంటర్‌లో గాయపడిన అనీస్ ఖాన్ చికిత్స పొందుతూ మరణించగా, అతని సహాయకులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. "నిందితులను సాంకేతిక, మాన్యువల్ ఇన్‌పుట్‌లు బాధితుడి ఫోటో ఆధారంగా గుర్తించాం. దీని ఆధారంగా, అయోధ్య పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ వారిపై దాడి చేశాయి" అని అయోధ్య సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు.

దాడి సమయంలో నేరస్థులు తమపై కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపేతా ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా, మూడో వ్యక్తి పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం కార్డన్ సెర్చ్ ప్రారంభించామని నయ్యర్ చెప్పారు. అతడిని గుర్తించి... నేరస్థుడిని లొంగిపోవాలని అడిగారు, కానీ అతను పోలీసులపై కాల్పులు జరిపాడు, ప్రతీకార కాల్పుల్లో గాయపడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. 

ఆగస్టు 30న రైలు కంపార్ట్‌మెంట్‌లో మహిళా కానిస్టేబుల్‌ కనిపించగా.. ఆమె సోదరుడు అదే రోజు పోలీసు కేసు పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత, అలహాబాద్ హైకోర్టు ఈ కేసును స్వీకరించింది. అర్థరాత్రి జరిగిన విచారణ సందర్భంగా రైల్వే పోలీసులు, యుపి ప్రభుత్వం రెండింటినీ కోర్టు ఈ కేసులోకి లాగింది.

click me!