
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీహార్ లోని పాట్నా వేదికగా శుక్రవారం (జూన్ 23న) ప్రతిపక్ష పార్టీల కీలక సమావేశం (all party meeting) జరుగనున్నది. ఈ సమావేశానికి ఒక్కరోజు విపక్షాల ఐక్యతలో చుక్కెదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ..ఆప్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వాలని, లేకుంటే తాము సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆప్.. కాంగ్రెస్‌కు అల్టిమేటం విధించింది.
వాస్తవానికి జూన్ 23న జరిగే సమావేశంలో ఢిల్లీ సర్వీస్ సెక్టార్‌లో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ముందుగా చర్చించాలని, ఆర్డినెన్స్ విషయంలో అన్ని పార్టీలు తమ మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ ఇంకా తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో ఇలా అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆర్డినెన్స్‌ను మొదటి నుంచి వ్యతిరేకించేందుకు సిద్ధంగా లేరు.లేదా ఆర్డినెన్స్‌కు తాను వ్యతిరేకం కాదని ప్రకటించలేదు. ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో కేజ్రీవాల్ అపాయింట్‌మెంట్ కోరారు. కానీ, అతని అపాయింట్మెంట్ ఆప్ కి దొరకలేదు.
కేజ్రీవాల్‌ను కలవడానికి కాంగ్రెస్ ఇంకా సమయం ఇవ్వలేదు. దీన్నిబట్టి కేజ్రీవాల్ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ తనకు మద్దతివ్వాలని, లేకుంటే ఢిల్లీ తరహా పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో కూడా రావచ్చని చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుండి ఆప్‌కి మద్దతు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ ప్రతిపక్ష పార్టీలకు లేఖ కూడా రాశారు. అటువంటి పరిస్థితిలో సరిగా సమావేశానికి ఒక రోజు ముందు.. ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీకి ఆర్డినెన్స్‌పై ఢిల్లీకి మద్దతు ఇవ్వాలని, లేకపోతే సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటం ఇచ్చినట్లు వర్గాలు ఉటంకిస్తున్నాయి.
ఈ విషయంపై కాంగ్రెస్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ స్పందించారు. కేజ్రీవాల్ సమావేశానికి రాకపోతే.. అతడే తన పేరును కోల్పోతాడనీ, అతను ఈ సమావేశానికి హాజరుకాకుండా సాకులు వెతుకుతున్నాడని ఆరోపించారు. ఈ సమావేశానికి హాజరుకాకూడదని అతనికి ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.