కేజ్రీవాల్ కేబినెట్.. కొత్త మంత్రులుగా అతిషి, సౌరభ్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం..

Published : Mar 09, 2023, 04:58 PM IST
కేజ్రీవాల్ కేబినెట్.. కొత్త మంత్రులుగా అతిషి, సౌరభ్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం..

సారాంశం

ఢిల్లీ మంత్రులుగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఢిల్లీ మంత్రులుగా ఆప్ ఎమ్మెల్యేలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అతిషికి విద్య, పీడబ్ల్యూడీ, విద్యుత్, పర్యాటక శాఖల బాధ్యతలను అప్పగించారు. సౌరభ్ భరద్వాజ్‌కు ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, నీటి, పరిశ్రమల శాఖల బాధ్యతలను కేటాయించారు. ఇక, అతిషి, సౌరభ్‌లను మంత్రులకు నియమించే ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి  తెలిసిందే. 

అతిషి విషయానికి వస్తే.. అతిషి కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నిర్వహించిన విద్యా బృందంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఇక,  భరద్వాజ్ ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఢిల్లీ జల్ బోర్డులో వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు. గతంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ  ఉప ముఖ్యమంత్రి మనీస్ సిసోడియా, మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్‌లు ఇటీవల వారి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం  తీసుకున్నారు. అతిషి, సౌరభ్ భరద్వాజ్‌ల కేబినెట్‌లో నియమాకానికి సంబంధించి కేజ్రీవాల్.. ప్రతిపాదనలు పంపారు. 

PREV
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu