Liquor Scam: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు.. ‘సీఎం ఆయనే’

By Mahesh K  |  First Published Mar 21, 2024, 9:22 PM IST

ఈడీ అధికారులు గురువారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సోదాలు జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను అరెస్టు చేశారు.


Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఈడీ అధికారుల బృందం సీఎం నివాసంలో సోదాలు జరిపి.. ప్రశ్నించిన తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రి అతిషి స్పందించారు. ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రి అని, ఇక పైనా ఆయనే సీఎం అని వివరించారు.

క్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా ఈడీ అధికారులను ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు ఇవాళ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ రూలింగ్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. సుమారు 12 మంది ఈడీ అధికారుల బృందం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు.

Latest Videos

సెర్చ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్, ఆయన కుటుంబం ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

ఈడీ అధికారులు వచ్చిన తర్వాత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్.. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. పోలీసులు సీఎం నివాసానికి వచ్చిన తీరు.. ఇతరులను ఎవరినీ లోనికి అనుమతించని వైనాన్ని చూస్తే.. సోదాలు చేస్తున్నట్టు అర్థం అవుతున్నదని వివరించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.

దీంతో వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ టీమ్ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తక్షణమే తమ పిటిషన్ విచారించాలని విజ్ఞప్తి చేసింది.

లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిది సార్లు సమన్లు పంపింది. కానీ, ఒక్కసారి కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. 

click me!