
తిరువనంతపురం: కేరళలోని Sabaraimala దేవాలయ ఆవరణలో శుక్రవారంనాడు Makara jyoti కన్పించింది.మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున శబరిమలకు చేరుకొన్నారు. Ayyappa నామస్మరణతో శబరిమల మార్మోగింది. Ponnalamedu కొండల వద్ద మకర జ్యోతి దర్శనం కన్పించింది.
Kerala లోని శబరిమల అయ్యప్ప ఆలయంలో Makaravilakku ఉత్సవాలు ఇవాళ జరిగాయి. ఇవాళ అయ్యప్ప తాను బాల్యాన్ని గడిపనట్టుగా విశ్వసించే పందళం ప్యాలెస్ నుండి తిరునాభవరణం అని పిలువబడే ఆబరణాలు తీసుకొచ్చి అయ్యప్పకు అలంకరించారు.
అయ్యప్ప పవిత్ర ఆభరణాలను 80 కి.మీ దూరంలో ఉన్న పందళం ప్యాలెస్ నుండి ఊరేగింపుగా శబరిమల క్షేత్రానికి తీసుకు వచ్చారు.
ఆ తర్వాత దీపారాధన చేశారు. దీపారాధన తర్వాత పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమఘాట్ పర్వత శ్రేణులలోని పొన్నంబలమేడు కొండపై జ్యోతి కన్పించింది. దీపారాధనతో ఏడు రోజుల మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.శుక్రవారం నాడు 75 వేల మంది భక్తులు మకర జ్యోతిని చూసేందుకు ఆలయానికి వస్తారని ట్రావెన్ కోర్ దేవాలయ బోర్డు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కొంత భక్తుల సంఖ్య తగ్గిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.మకర జ్యోతి నక్షత్రం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కన్పిస్తోంది. ఇది ధనుస్సురాశి నుండి మకర రాశి వరకు సూర్యుడి సంచారాన్ని సూచిస్తుంది. జనవరి 14 నుండి మలయాళ నెల మకరం మొదటి రోజు. మకర జ్యోతి దర్శనంతో వార్షిక శబరిమల యాత్ర ముగింపును సూచిస్తుంది. మకరవిళక్కు ఉత్సవం ఏడు రోజుల పాటు నిర్వహిస్తారు. పండుగ ముగిసి కురుతి పూజ జరిగే వరకు శబరిమలలోనే ఉంటారు.