ముప్పై రూపాయల కోసం 17యేళ్ల మైనర్ గొంతుకోసి హత్య..

Published : Sep 30, 2023, 01:08 PM IST
ముప్పై రూపాయల కోసం 17యేళ్ల మైనర్ గొంతుకోసి హత్య..

సారాంశం

ముప్పై రూపాయల కోసం జరిగిన గొడవలో వివాదం కారణంగా ఓ 17 యువకుడిని గొంతుకోసి హత్య చేశారు. 

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రూ.30 కోసం ముగ్గురితో చెలరేగిన వివాదంలో 17 ఏళ్ల యువకుడిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. కేహెచ్‌ఆర్ ఇంటర్ కాలేజీలో 11వ తరగతి చదువుతున్న బాలుడిని శుక్రవారం రాత్రి నిందితులు హత్య చేసినట్లు వారు తెలిపారు.

బరౌత్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దేవేష్ కుమార్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ హత్యకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో రూ. 30కి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలుడికి అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో రూ.30ల లావాదేవీకి సంబంధించి వివాదం తలెత్తడంతో వివాదం ముదిరి నిందితులు గొంతుకోసి హత్య చేశారని తేలింది. 

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురూ బాలుడికి తెలుసునని కుటుంబ సభ్యులు చెప్పారని, అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని వారు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

100 కాదు 132 శాతం లక్ష్యం... యువతకు ఉపాధిలో ఈ ప్రాంతం రికార్డు
మంచులో దూసుకెళ్లిన వందే భారత్: Tourists Reaction | Katra–Srinagar | Snow Train | Asianet News Telugu