దారుణం : ఆరేళ్ల చిన్నారిపై 14యేళ్ల బాలుడు అత్యాచారం.. అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Sep 29, 2023, 4:09 PM IST

మైనర్ బాలుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లో వెలుగుచూసింది. ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. 


ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ 14యేల్ల బాలుడు  రాయ్‌పూర్ నగర శివార్లలోని ఓ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై  అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 14 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించినట్లు వారు తెలిపారు.

ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం ధర్సిన్వా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రాయ్‌పూర్ సిటీ) లఖన్ పాట్లే తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, యువకుడు చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక ఇంటికి వచ్చిన తరువాత.. పొట్టలో నొప్పిగా ఉందని తల్లికి ఫిర్యాదు చేసింది. 

Latest Videos

వివాహేతర సంబంధం : ప్రియురాలిని కొట్టాడని.. ఆమె భర్తపై ప్రియుడి కాల్పులు..

తల్లి గమనించగా ఆమె ప్రైవేట్ భాగాలలో రక్తస్రావం జరిగింది. దీంతో కంగారు పడ్డ తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె మీద అత్యాచారం జరిగిందని నిర్థారించారు.   దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలుస్తోంది. భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పాట్లే తెలిపారు.

click me!