హజ్ యాత్రలో విషాదం ... 98 మంది భారతీయుల మృతి

By Arun Kumar P  |  First Published Jun 21, 2024, 5:02 PM IST

పవిత్ర మక్కా సందర్శన చేపడుతున్న హజ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సౌదీ అరెబియాలో ప్రస్తుతం ఎండల తీవ్రత మరీ ఎక్కువగా వుండటంతో యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు.


న్యూడిల్లీ : ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సౌది అరెబియాలో హజ్ యాత్రలో చేపడుతున్న భారతీయుల్లో 98 మంది మృతిచెందినట్లు సమాచారం. హజ్ యాత్రికుల మృతిని భారత విదేశాంగ శాఖ కూడా దృవీకరించింది. 

ప్రస్తుతం సౌదీ అరెబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలతో వడ దెబ్బ తగిలి కొందరు... ఇతర అనారోగ్య సమస్యలతో మరికొందరు హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఇప్పటివరకు కేవలం భారతీయులే 98 మంది చనిపోయినట్లు భారత విదేశాంగ శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.  

Latest Videos

మొత్తంగా పవిత్ర మక్కాను సందర్శించేందుకు వివిధ దేశాలనుండి సౌదీకి వెళ్లినవారిలో 1000 మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం. ఎండల కారణంగా హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.... మరీముఖ్యంగా వృద్దులు ఈ వేడి వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మక్కాలో 50 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 

click me!