పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడిపోయిన కారు.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి..

Published : Feb 20, 2022, 10:58 AM ISTUpdated : Feb 20, 2022, 11:03 AM IST
పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడిపోయిన కారు.. పెళ్లి కొడుకుతో సహా 9 మంది మృతి..

సారాంశం

Kota Accident: రాజస్థాన్‌లోని (Rajasthan) కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలోకి కారు దూసుకెళ్లింది. దీంతో 9 మంది మృతిచెందారు. పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. 

Kota Accident: రాజస్థాన్‌లోని (Rajasthan) కోట జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంబల్ నదిలోకి కారు దూసుకెళ్లింది. దీంతో 9 మంది మృతిచెందారు. పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోగా వారిలో పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. వాస్తవానికి శనివారం రాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 

పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్న కారు అదుపుతప్పి.. కోటలోని నయాపురా కల్వర్టు నుంచి చంబల్‌ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉదయం ప్రమాద సమాచారం అందడంతో పోలీసులు డైవర్ల బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నదిలో గల్లంతైన వారందరి మృతదేహాలను బయటకు తీశారు.

ప్రమాదానికి గురైన కారు.. సవారీ ఊరేగింపు శనివారం సాయంత్రం చౌత్ కా బర్వాడ నుండి ఉజ్జయినికి బయలుదేరింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఉండగా.. అందులో వరుడు కూడా ఉన్నారు. రాత్రివేళ కారు అతివేగంగా వెళ్లడంతో.. డ్రైవర్‌ కల్వర్ట్‌‌ను సరిగా అంచనా వేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని.. కారు అదుపుతప్పి నదిలో పడిపోయిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

ఈ ప్రమాదంపై రాజస్థాన్ ప్రభుత్వ మంత్రి శాంతి ధరివాల్ విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ ప్రమాదంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా విచారం వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Earth 5 Major Risks : థర్డ్ వరల్డ్ వార్ కాదు.. అంతకంటే పెద్ద ముప్పు భూమికి రాబోతోంది
PM Modi in Bodo Cultural Programme: బోడో సాంస్కృతిక కార్యక్రమంలో ప్రధాని మోదీ| Asianet News Telugu