స్కూల్ వ్యాన్ లోయలో పడి 8 మంది పిల్లల మృతి

Published : Aug 06, 2019, 12:21 PM IST
స్కూల్ వ్యాన్ లోయలో పడి 8 మంది పిల్లల మృతి

సారాంశం

 ఉత్తరాఖండ్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 8 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తెహ్రీ గర్హ్వాల్ లోని కంగ్సాలి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. 

న్యూ తెహ్రీ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 8 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన తెహ్రీ గర్హ్వాల్ లోని కంగ్సాలి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. 

బస్సులో మొత్తం 18 పిల్లలు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి దూసుకెళ్లి లోయలో పడింది. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

ప్రమాదంలో ఎనిమిది మరణించినట్లు పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ అజయ్ రౌటేలా ధృవీకరించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

మరో ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారు. ఉన్నావ్ జిల్లాలో ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వేపై  బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ