ఐదేళ్లలో పోలీసు కస్టడీలో ఎన్ని మరణాలు సంభవించాయి? పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ ఏం చెప్పింది?  

Published : Feb 09, 2023, 03:22 AM IST
ఐదేళ్లలో పోలీసు కస్టడీలో ఎన్ని మరణాలు సంభవించాయి? పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ  ఏం చెప్పింది?  

సారాంశం

గత ఐదేళ్లలో భారతదేశ వ్యాప్తంగా 669 పోలీసు కస్టడీలో మరణించిన కేసులు నమోదయ్యాయి హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ అందించిన డేటాను ఉటంకిస్తూ పోలీసు కస్టడీలో మరణాల గురించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాచారం ఇచ్చారు.   

భారతదేశంలో గత ఐదేళ్లలో పోలీసు కస్టడీలో ఆరువందల యాభైకి పైగా మరణాలు సంభవించాయి. లిఖితపూర్వక సమాధానంలో పార్లమెంట్‌కు హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 669 పోలీసు కస్టడీ మరణాలు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు తెలిపారు. 

2017 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు పోలీస్‌ కస్టడీలో 669 మంది చనిపోయినట్లు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) అందించిన డేటాను ఉటంకిస్తూ మంత్రి నిత్యానంద్ రాయ్ సభలో ఈ సమాచారాన్ని ఇచ్చారు. ఇన్నేళ్లలో పోలీసు కస్టడీలో చాలా మంది చనిపోయారు

మంత్రి నిత్యానంద్ రాయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2021-2022లో పోలీసు కస్టడీలో మరణించిన మొత్తం 175 కేసులు నమోదయ్యాయి. 2020-2021లో 100 మరణాలు, 2019-2021లో 112, 2018-2019లో 136, 2017-2018లో 146 లాకప్‌ డెత్‌లు నమోదయ్యాయని చెప్పారు.  

కాగా..  ఏప్రిల్ 1, 2017 నుండి మార్చి 31, 2022 మధ్య కాలంలో 201 కేసులలో  రూ. 5,80,74,998 పరిహారంతోపాటు ఒక కేసులో క్రమశిక్షణా చర్యలను ఎన్‌హెచ్‌ఆర్సీ సిఫార్సు చేసిందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం పోలీసు, పబ్లిక్ ఆర్డర్ రాష్ట్ర అంశాలని స్పష్టం చేస్తూ..  మానవ హక్కుల పరిరక్షణను నిర్ధారించడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.

అలాగే.. మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాలానుగుణంగా సలహాలు ఇస్తుందని , మానవ హక్కుల చట్టం (PHR)1993ని కూడా అమలులోకి తెచ్చిందని, ఇది NHRC , రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ప్రభుత్వోద్యోగులచే ఆరోపించబడిన మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది. మానవ హక్కుల ఉల్లంఘనపై ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదులు అందినప్పుడు, మానవ హక్కుల చట్టం కింద నిర్దేశించిన నిబంధనల ప్రకారం కమిషన్ చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Assets Full Details | Nitin Nabin 2025 Election | Loans, Property | Asianet News Telugu
సొంతూళ్లోనే ఉంటూ రోజుకు రూ.6-7 వేల సంపాదన.. ఓ మహిళ సక్సెస్ స్టోరీ