అమ్మవారి గుడిలో మద్యం పంపిణీ..

Published : Jan 08, 2019, 12:21 PM IST
అమ్మవారి గుడిలో మద్యం పంపిణీ..

సారాంశం

పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు బీజేపీ నేతలు అపవిత్రం చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు మద్యం సీసాలు పంపిణీ చేశారు. 

పవిత్రమైన అమ్మవారి ఆలయాన్ని కొందరు బీజేపీ నేతలు అపవిత్రం చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు మద్యం సీసాలు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ లోని శ్రావణ దేవీ ఆలయంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రావణ దేవీ ఆలయంలో పాసి సమ్మేళన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లంచ్ బాక్సుల్లో ఫుడ్ తోపాటు మద్యం సీసాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొందరు చిన్నారులు కూడా పాల్గొనడంతో.. వారికి కూడా ఇవే బాక్సులు అందాయి.

భోజనం అనుకొని తిందామని చూసిన చిన్నారులు అందులో మద్యం సీసాలు చూసి ఖంగుతిన్నారు. దీంతో.. ఈ విషయం కాస్త బయటకు పాకి దుమారం లేపింది. కాగా.. ఈ ఘటనపై స్థానిక ఎంపీ అన్షుల్ వర్మ స్పందించారు.

అమ్మవారి దేవాలయంలో ఇలా మద్యం పంపిణీ చేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం వద్దకు తీసుకువెళ్లి.. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటామన్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన నితిన్ ఇటీవల బీజేపీలో చేరాడని.. అతని తండ్రే ఈ పనిచేశాడని ఎంపీ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport