
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని నిరాని షుగర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం నాడు బాయిలర్ పేలి ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నిరాని షుగర్ ఫ్యాక్టరీ మాజీ మంత్రికి చెందిందిగా స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.