కాలువలో పడినకారు.. ఒకే కుటుంబానికిచెందిన 6గురు మృతి

Published : Mar 13, 2019, 04:17 PM IST
కాలువలో పడినకారు.. ఒకే కుటుంబానికిచెందిన 6గురు మృతి

సారాంశం

కారు అదుపు తప్పి కాలువలో పడి... ఒకే కుటుంబానికి  చెందిన ఆరుగురు కన్నుమూశారు.

కారు అదుపు తప్పి కాలువలో పడి... ఒకే కుటుంబానికి  చెందిన ఆరుగురు కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి పొల్లాచి  వెళ్తున్న కారు అదుపు తప్పి పరంబికుళం అల్లైర్  కాలువలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. డ్రైవర్  కారు వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ప్రమాదం వాటిల్లింది. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం పొల్లాచి జనరల్ హాస్పిటల్‌ కి తరలించారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్
Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?