రూటు మార్చిన ఉగ్రవాదులు: శ్రీలంక గుండా భారత్‌లోకి, విధ్వంసానికి కుట్ర

By Siva KodatiFirst Published Aug 23, 2019, 10:19 AM IST
Highlights

భారత్ విధ్వంసం సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది. పలువురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. శ్రీలంక గుండా భారత్‌లోకి ప్రవేశించినట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి

భారత్ విధ్వంసం సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది. పలువురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. శ్రీలంక గుండా భారత్‌లోకి ప్రవేశించినట్లుగా ఇంటెలిజెన్స్ హెచ్చరించింది.

తమిళనాడు రాజధాని చెన్నైలో ఆరుగురు ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఐబీ హెచ్చరికలతో తమిళనాడు పోలీసులు రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. కాగా... 3 నెలల నుంచి 25 మంది ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రాష్ట్రంలోకి ప్రవేశించిన ఆరుగురు ఉగ్రవాదుల కోసం పోలీసులు తమిళనాడును జల్లెడపడుతున్నారు.  

కాగా.. కొద్దిరోజుల క్రితం ఆఫ్గానిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులు మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లుగా ఐబీ హెచ్చరించడంతో రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!