సెప్టిక్ ట్యాంకులో గ్యాస్ లీక్: ఆరుగురి మృతి, ఒకే కుటుంబంలో ముగ్గురు

By narsimha lodeFirst Published Aug 10, 2020, 3:26 PM IST
Highlights

సెప్టిక్ నిర్మిస్తున్న సమయంలో టాక్సిక్ గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.  ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘడ్ జిల్లాలో చోటు చేసుకొంది.


రాంచీ: సెప్టిక్ నిర్మిస్తున్న సమయంలో టాక్సిక్ గ్యాస్ లీకైన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.  ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘడ్ జిల్లాలో చోటు చేసుకొంది.

ఈ ఘటనలో బ్రజేష్ చంద్ర భర్నావాల్ (50), చంద్ర బర్నావవాల్(40), గోవింద్ మంజి(50), బబ్లూ మంజీ(30), లాలూ మంజి(25) లీల్ ముర్ము (30) మరణించినట్టుగా అధికారులు గుర్తించారు. 

డియోఘడ్ జిల్లాలోని దేవీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  సెప్టిక్ ట్యాంక్ 20 ఫీట్ల లోతు, ఏడు ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. 

సెప్టిక్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించి ఉపయోగించిన సెంట్రింగ్ మెటీరియల్ ను తొలగించేందుకు ఒకరి తర్వాత వెళ్లిన కార్మికులు మృత్యువాత పడ్డారు. 

సెప్టిక్ ట్యాంకు లోపలికి వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో అధికారులు వారిని బయటకు తీసి సర్ధార్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వీరిని వైద్యులు పరీక్షించి చనిపోయినట్టుగా ప్రకటించారు.

సెప్టిక్ ట్యాంకు నుండి వెలువడిన లెథల్ గ్యాస్ కారణంగా శ్వాస సంబంధమైన ఇబ్బందులతో మృత్యువాత పడి ఉండొచ్చని  కమలేశ్వర్ ప్రసాద్ సింగ్ డియోఘడ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

సెప్టిక్ ట్యాంకు లోపలికి లీలు ముర్ము తొలుత వెళ్లాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ గోవింద్ మాంఝీ సెప్టిక్ ట్యాంకులోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు బబ్లూ, లాలూ కూడ లోపలికి వెళ్లారు. వారు కూడ తిరిగి రాకపోవడంతో బ్రజేశ్ చంద్ర, మితిలేష్ చంద్రలు కూడ వెళ్లి మరణించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 

click me!