అమరావతిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Published : Mar 27, 2022, 05:14 PM IST
అమరావతిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

సారాంశం

మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. వివాహ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ముంబై:మహారాష్ట్రలోని Amaravatiలో ఆదివారం నాడు జరిగిన Road accident లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. అమరావతిలో జరిగే marriage కార్యక్రమంలో పాల్గొనేందుకు carలో వెళ్తున్న ఐదుగురు మరణించారు.

నంద్‌గావ్‌పేట- దేవల్ గావ్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ట్రక్కు రెండు టైర్లు ఊడిపోయాయి. అంజన్ గావ్ నుర్జీ గ్రామానికి చెందిన కుటుంబం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వాల్గావ్ మీదుగా నంద్‌గావ్ పేట వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

 కారు పోటే కాలేజీ వద్దకు చేరుకోగానే టూ వీలర్ నుండి ఓటర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో ఎదురు  వేగంగా వస్తున్న Truck కారును ఢీకొట్టింది.  అంతేకాదు కారును ఢీకొట్టిన ట్రక్కు విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టి అవతలి రొడ్డుపై వెళ్లి నిలిచిపోయిందని నంద్ గావ్ పేట పోలీసులు తెలిపారు. 

ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు పక్కనే పనిచేస్తున్న కూలీలు అక్కడికి చేరుకొన్నారు. అయితే ప్రమాద స్థలంలోనే కారులోనే నలుగురు మరణించారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను కూడా మరణించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ వరుస ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. చిత్తూరు జిల్లా బాకరాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో 55 మంది గాయపడ్డారు. ఇదే రాష్టరంలోని ఐతేపల్లిలో ట్రాక్టర్ , మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు కూడా వివాహ నిశ్చితార్ధాలకు వెఁళ్లే సమయాల్లో చోటు చేసుకొన్నాయి. మహారాష్ట్ర అమరావతిలో జరిగిన ప్రమాదం మాత్రం వివాహనికి వెళ్తున్న సమయంలో జరిగింది. 


 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !