వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం...ఐదుగురు సజీవదహనం

Published : May 09, 2019, 10:56 AM IST
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం...ఐదుగురు సజీవదహనం

సారాంశం

వస్త్ర దుకాణంలో అగ్రిప్రమాదం జరిగి...ఐదుగురు సజీవదహనమైన సంఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా ఉరులేదేవాచీ గ్రామంలో చోటుచేసుకుంది.  

వస్త్ర దుకాణంలో అగ్రిప్రమాదం జరిగి...ఐదుగురు సజీవదహనమైన సంఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా ఉరులేదేవాచీ గ్రామంలో చోటుచేసుకుంది.  గురువారం తెల్లవారుజామున దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. 

అగ్నిమాపక  ఘటనాస్థలికి చేరుకుని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు. విలువైన వస్త్రాలు మంటల్లో కాలిపోవడంతో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనావేస్తున్నారు. విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?