ముంబైలో భారీ అగ్నిప్రమాదం: ఐదుగురు దుర్మరణం

Published : Dec 28, 2018, 08:28 AM IST
ముంబైలో భారీ అగ్నిప్రమాదం: ఐదుగురు దుర్మరణం

సారాంశం

ముంబైలోని తిలక్‌నగర్‌లోని అపార్టుమెంట్ 11వ అంతస్తులో షార్టు సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిలిండరు పేలి మంటలు వ్యాపించాయి. అపార్టుమెంట్ లో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో ఐదుగురు మరణించారు. 

ముంబై: ముంబైలోని 15 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తన్నారు. 

ముంబైలోని తిలక్‌నగర్‌లోని అపార్టుమెంట్ 11వ అంతస్తులో షార్టు సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిలిండరు పేలి మంటలు వ్యాపించాయి. అపార్టుమెంట్ లో దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో ఐదుగురు మరణించారు. 

భవనంలో అగ్నిమాపక వ్యవస్థ పనిచేయక పోవడంతో సకాలంలో మంటలను అదుపులోకి రాలేదు. మృతుల్లో సునీతా జోషి, బాలచంద్ర జోషి, సుమన్ జోషి, సరళా గంగార్, లక్ష్మీబెన్ గంగార్ ఉన్నారు. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస జోషి, ఫైర్ మెన్ చాగన్ సింగ్ లను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది భవనంలోని వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !