న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: ఐదుగురి మృతి, 11 మందికి గాయాలు

Published : Aug 06, 2019, 07:12 AM IST
న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: ఐదుగురి మృతి, 11 మందికి గాయాలు

సారాంశం

న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని జకీర్ నగర్ లోని బహుళ అంతస్తుల స్టోర్స్ లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. 

మంటల్లో చిక్కుకొన్న 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఏడు కార్లు, ఎనిమిది బైక్ లు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్