ప్రజా ప్రతినిధులపై 4859 పెండింగ్ కేసులు: యూపీలోనే అత్యధికంగా పెండింగ్ కేసులు

By narsimha lodeFirst Published Oct 5, 2020, 3:06 PM IST
Highlights

దేశంలోని యూపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై అత్యధికంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరమే విచారించేందుకు సుప్రీంకోర్టు రంగం సిద్దం చేసింది.


న్యూఢిల్లీ: దేశంలోని యూపీకి చెందిన ప్రజా ప్రతినిధులపై అత్యధికంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరమే విచారించేందుకు సుప్రీంకోర్టు రంగం సిద్దం చేసింది.

ఈ మేరకు దేశంలోని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులపై 4859  కేసులు పెండింగ్ లో ఉన్నట్టుగా  అమికస్ క్యూరీ ప్రకటించింది.

యూపీ రాష్ట్రానికి చెందిన ప్రజా ప్రతినిధులపై అత్యధిక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. . ఏపీ రాష్ట్రంలోని 132 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులపై 143 కేసులు పెండింగ్ లో ఉన్నాయని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు  తెలిపారు.

ఏపీ రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్లో 10 సెషన్స్ కోర్టుల్లో ఉన్నాయి. మరో 122 కేసులు మేజిస్ట్రేట్ స్థాయి కోర్టుల్లో ఉన్నట్టుగా నివేదికలు చెబుతున్నాయి.ఈ కేసుల విచారణకు గాను ప్రతి జిల్లాలో ఒక మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపీ హైకోర్టు ప్రకటించింది.సెషన్స్ స్థాయిలో కూడ విశాఖ, కడపలో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనుంది ఏపీ హైకోర్టు.

తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్ లో ఉన్న కేసుల్లో హైద్రాబాద్ ప్రత్యేక కోర్టులో 118, 25  కేసులు సీబీఐతో పాటు ఇతర కోర్టుల్లో ఉన్నాయి.కరీంనగర్, మహాబూబ్ నగర్ లలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించింది.ఏడాదిలోపుగా ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

click me!