కరోనాతో దేశం కకావికలం: రైల్వే శాఖ ఆపన్న హస్తం.. 64 వేల బెడ్లు సిద్ధం

By Siva KodatiFirst Published Apr 27, 2021, 10:08 PM IST
Highlights

రైల్వే శాఖ కరోనా బాధితులకు సేవ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ప్రయాణాలు అంతగా లేకపోవడంతో రైళ్లకు డిమాండ్ పడిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్ లక్షణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అయితే వీరిలో అత్యవసర పరిస్థితిలో వున్న వారికి బెడ్లు అందించలేక ఆసుపత్రులు చేతులేత్తేస్తున్నాయి.

రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతుండటం.. రికవరీ రేటు పడిపోవడంతో బెడ్లు నిండుకున్నాయి. దేశంలో ఏ మూల, ఏ హాస్పిటల్‌కు వెళ్లినా ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో బెడ్ల కొరతను తీర్చేందుకు గాను ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. 

ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కరోనా బాధితులకు సేవ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ప్రయాణాలు అంతగా లేకపోవడంతో రైళ్లకు డిమాండ్ పడిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

Also Read:ఒక్కరి నుంచి 406మందికి కరోనా సోకే ప్రమాదం..!

ఈ మేరకు రైళ్ల ద్వారా సుమారు 64,000 బెడ్లను రైల్వే శాఖ అందుబాటులోకి  తీసుకువచ్చింది. ఇందుకోసం 4 వేల కోచ్‌లను కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

ప్రస్తుతం 169 కోచ్‌లు పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని రైల్వే మంత్రి గుర్తుచేశారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆ రైల్వే కోచ్‌లను కేటాయిస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సదరు రైల్వే కోచ్‌లకు సంబంధించిన వీడియోను కూడా కేంద్ర మంత్రి ట్విటర్‌కు జత చేశారు.

click me!