భారీ వర్షానికి కూలిన భవనం.. నలుగురి మృతి

By telugu teamFirst Published Aug 10, 2019, 8:19 AM IST
Highlights

గత కొద్ది రోజులుగా వరసగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్ లోని నడియాడ్ లో రెండస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, శిధిలాల కింద చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా వెలికితీశారు.

భారీ వర్షానికి భవనం  కూలి నలుగురు మృతి చెందిన సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా వరసగా కురుస్తున్న వర్షాలకు గుజరాత్ లోని నడియాడ్ లో రెండస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, శిధిలాల కింద చిక్కుకున్న మరో ఐదుగురిని సురక్షితంగా వెలికితీశారు. 

ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా ప్రగతి నగర్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శిథిలాలను తొలగించి.. సహాయ చర్యలను చేపట్టారు. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుజరాత్‌ వ్యాప్తంగా భారీ వర్షాలకు కురుస్తున్న విషయం తెలిసిందే. నర్మదా నది పరీవాహక ప్రాంతంలో వరద ఉధృతంగా పెరగడంతో సర్థార్‌ సరోవర్‌ డ్యాం గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు.

click me!