దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 358కి చేరకున్నాయి. కొత్త వేరియంట్ సోకిన వారిలో 144 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ శుక్రవారం వివరాలను వెల్లడించింది.
దేశంలో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో 358 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో కలిపి నేటికి 358 మొత్తం ఒమిక్రాన్ కేసులు అయ్యాయని, 144 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు.
ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఒమిక్రాన్ విజృంభణ.. పలు రాష్ట్రాల్లో ఆంక్షలు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?
undefined
దేశంలో 89 శాతం మందికి మొదటి డోసు..
దేశంలో ఇప్పటి వరకు అర్హులైన వారిలో 89 శాతం మంది మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ తెలిపారు. 61 శాతం మంది రెండవ డోస్ వేయించుకున్నారని చెప్పారు. ఒమిక్రాన్ కేసుల్లో 183 మంది బాధితులు మహిళలు ఉన్నారని చెప్పారు. దేశ ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19, ఒమిక్రాన్ కేసులను ప్రధానమంత్రి, ఆరోగ్య మంత్రి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కరోనాను ఎదుర్కొవడానికి దేశం సంసిద్ధంగా ఉందని తెలిపారు. కరోనా వస్తే ఎదుర్కొవడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశంలో 18,10,083 ఐసోలేషన్ బెడ్స్, 4,94,314 ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్ ఉన్నాయని తెలిపారు. 1,39,300 ఐసీయూ బెడ్స్, 24,057 పీడియాట్రిక్ ఐసీయూ బెడ్స్, 64,796 పీడియాట్రిక్ నాన్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయని తెలిపారు. దేశంలో పెరుగుతున్న బూస్టర్ డోస్ డిమాండ్ పై రాజేష్ భూషన్ స్పందించారు. బూస్టర్ డోసు ఎలా పని చేస్తుంది ? దాని వల్ల ఎదురయ్యే పర్యావసానాలు ఏంటనే విషయంలో శాస్త్రీయంగా అధ్యయనం జరుగుతోందని అన్నారు. ఆ శాస్త్రీయ అధ్యయనాల ఫలితాల ఆధారంగా బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
18 ఏండ్లలోపు వారిపై ఒమిక్రాన్ పంజా
ఆసియాలో తక్కువగానే కోవిడ్ - 19
యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలో ప్రతీ వారం కరోనా కేసులు పెరుతున్నాయని రాజేష్ భూషన్ తెలిపారు. అయితే ఆసియాలో మాత్రం తగ్గుదల కనిపిస్తోందని అన్నారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనికి అధికంగా వ్యాపించే గుణం ఉందని తెలిపిందని చెప్పారు. ఇది నమోదైన తరువాత ఒకటిన్నర రోజు నుంచి మూడో రోజు వరకు రెట్టింపు అవుతాయని తెలిపారు. కాబట్టి దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
దేశంలో ఇప్పటికీ డెల్టా ప్రధానమైన వేరియంట్ అని ఐసీఎంఆర్ డీజీ బలరామ్ భార్గవ అన్నారు. ఇటీవల గుర్తించిన క్లస్టర్‌లతో సహా ఇండియాలో ప్రధానమైన జాతి డెల్టా అని ఆయన అన్నారు. కాబట్టి కఠిన కరోనా నిబంధనలను అనుసరిస్తూనే వ్యాక్సినేషన్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించి, రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు