రాయ్‌ఘడ్‌లో విరిగిపడిన కొండచరియలు: 32 మంది మృతి

By narsimha lodeFirst Published Jul 23, 2021, 2:15 PM IST
Highlights


మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో కొండచరియలు విరిగిన ఘటనలో 32 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు.
 

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ జిల్లాలోని తలై గ్రామంలో  కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 32 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలోని కొంకణ్ తాలుకాలోని తలై గ్రామంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం నాడు సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ గ్రామానికి వెళ్లే దారిలో కూడ కొండచరియలు విరిగిపడ్డాయని  అధికారులు తెలిపారు. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు  ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.

also read:మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు: చిక్కుకున్న 300 మంది

ఈ గ్రామంలో సుమారు 80 నుండి 90 మంది నివసిస్తున్నారు. శిథిలాల కింద సుమారు 36 ఇళ్లు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.ఇప్పటికే సుమారు 32 మంది మరణించినట్టుగా అధికారులు తెలిపారు. మృతదేహలను శిథిలాల నుండి వెలికితీశారు. ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు.  ఈ గ్రామానికి సమీపంలోని నది ఉప్పొంగడంతో సహాయక చర్యలకు గ్రామానికి వెళ్లే సిబ్బంది ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది రంగంలోకి దిగి శిథిలాల కింద ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

click me!