10 నెలల చిన్నారిపై అత్యాచారం.. గుజ‌రాత్ లో మ‌రో ఘోరం

Published : Sep 25, 2024, 03:50 PM IST
10 నెలల చిన్నారిపై అత్యాచారం.. గుజ‌రాత్ లో మ‌రో ఘోరం

సారాంశం

గుజరాత్‌లోని బరూచ్‌లో 10 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్. పాప తన అమ్మమ్మతో ఉందనీ, నిందితుడు పాప‌ను షాప్ నుంచి ఇంటికి తీసుకెళ్లే మార్గంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడ‌ని మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి.  

గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో 10 నెలల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ ఓజా తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అంకలేశ్వర్ తాలూకాలోని పనోలిలో ఈ దారుణ ఘటన జరిగింది.

మీడియా నివేదికల ప్రకారం, పాప తన అమ్మమ్మతో ఉంది. చిన్నారి వారి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఆడుకుంటూ ఉండ‌గా, నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి అక్క‌డి నిర్మానూష్య ప్రాంతంలో లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. అయితే, పాప అరుపులు విని అమ్మ‌మ్మ వెళ్లి చూడ‌గా, గాయాల‌తో ప‌డివుంది. 

దీపక్ కుమార్ లాల్ బాబు సింగ్ అనే నిందితుడు పసికందును తన ఇంటికి తీసుకెళ్లే మార్గంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ ఓజా తెలిపారు. కాగా, చిన్నారి తల్లి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తోంది. నిందితుడికి పసిపాప, ఆమె కుటుంబ సభ్యులకు ప‌రిచ‌యం ఉంది.

చాలా సార్లు వారింటికి కూడా వ‌చ్చేవాడు. ఆదివారం చిన్నారి వారి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో నిందితులు ఆమెను తీసుకెళ్లి ఇంటికి కొద్దిదూరంలో అత్యాచారం చేశారు. చిన్నారి నాయనమ్మ కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చి చూడ‌గా చిన్నారికి తీవ్రగాయాలై రక్తం కారుతోంది. ఆగ్రహించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు.

నిందితుడిని అరెస్టు చేయడానికి ముందు పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బాధితురాలికి, నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం