ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం, మహిళ మృతి

Published : Sep 17, 2020, 10:11 AM IST
ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం, మహిళ మృతి

సారాంశం

ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు దాడులు నిర్వహించాయి. కాగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సాధారణ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది.. తీవ్రంగా గాయపడ్డారు.

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా గురువారం ఉదయం బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్‌, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో మొదట ఓ తీవ్రవాది హతమయ్యాడు. అనంతరం సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగించి.. మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. 

కాగా.. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు దాడులు నిర్వహించాయి. కాగా.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ సాధారణ మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది.. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works