యూపీలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం !

By Rajesh KarampooriFirst Published Oct 6, 2022, 3:59 AM IST
Highlights

ఉత్తర​ప్రదేశ్​లోని ఆగ్రాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  షాగంజ్​ ప్రాంతంలో ఉన్న మధురాజ్​ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆస్పత్రి డైరెక్టర్​ రాజన్​, ఆయన కుమార్తె షాలు, కుమారుడు రిషి సజీవదహనమయ్యారు.

 ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని ఓ ఆసుపత్రిలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో ఒక వైద్యుడు సహా ముగ్గురు వ్యక్తులు మ‌ర‌ణించారు. ఆస్పత్రిలోని రెండో అంతస్థులో నివాసం ఉంటున్న డాక్టర్‌తో పాటు ఆయన కుమారుడు, కుమార్తె  సజీవ ద‌హ‌నమ‌య్యారు.వైద్యుడి భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. 

అసలేం జరిగిందంటే?

ఆగ్రాలో జిగ్నేర్​ రోడ్డులో ఉన్న మధురాజ్​ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఆ మంట‌లు క్ర‌మంలో దావ‌నంలా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదాన్ని గమనించిన స్థానికులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అదే స‌మ‌యంలో అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నించారు.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్ర‌మించారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో చిక్కుకున్న రోగులు, ఆస్పత్రి సిబ్బందిని బయటకు తీసుకొచ్చి వేరే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని  పోలీసులు తెలిపారు.

అయితే.. ఆస్పత్రి బిల్డింగ్​ రెండో అంతస్తులో ఆస్పత్రి డైరెక్టర్​ రాజన్​ తన కుటుంబంతో నివాసం ఉంటున్న వారిని మాత్రం కాపాడ‌లేకపోయారు. ఈ ఘ‌ట‌న‌లో డాక్టర్ రాజన్ సింగ్, అతని కుమారుడు రిషి, కుమార్తె షాలు సజీవ ద‌హ‌నమ‌య్యారు.వైద్యుడి భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.  

మంటలు వ్యాప్తి చెందిన స‌మ‌యంలోఅతడి కుటుంబం నిద్రిస్తోంది. పొగలు విపరీతంగా అలుముకోవడం వల్ల రాజన్​ కుటుంబసభ్యులు బయటకు రాలేకపోయారు. దీంతో రాజన్​, ఆయన కుమారుడు, కుమార్తె సజీవదహన మయ్యారు.  అలాగే ఆసుపత్రిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీశామ‌ని,  సంఘటనా స్థలం నుండి నలుగురిని కూడా రక్షించారని పోలీసులు చెప్పారు.
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రోగులను బయటకు తీసి ఇతర ఆసుపత్రులకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ జస్వీర్ సింగ్ సిరోహి తెలిపారు.
 

click me!