మరోసారి ఉత్తరకాశీలో భూప్రకంపనాలు.. అర్ధరాత్రి వేళ భయంతో జనం పరుగులు .. 

By Rajesh KarampooriFirst Published Dec 28, 2022, 4:43 AM IST
Highlights

ఉత్తరాఖండ్‌లో  భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో బుధవారం తెల్లవారుజామున  2.19 నిమిషాలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో చాలాసార్లు భూప్రకంపనాలు సంభవించాయి. 

ఉత్తరాఖండ్‌లో మరోసారి భూకంపం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మంగళవారం అర్ధరాత్రి 2:19 గంటలకు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1 గా నమోదైనట్టు తెలుస్తోంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 2.19 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకూ ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం లేదు.
 
అంతకుముందు డిసెంబర్ 12, డిసెంబర్ 19 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో భూకంపం చోటుచేసుకుంది. అప్పుడు కూడా ఉత్తరకాశీలో భూమి కంపించింది. డూన్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సంభవించాయి. వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన సీనియర్ భూకంప శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ పాల్ ప్రకారం.. భారత ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్లు కదులుతున్న తీరు, నిరంతర భౌగోళిక కదలిక కొనసాగుతోందని తెలిపారు.

అటువంటి పరిస్థితిలో, నేపాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ , కాశ్మీర్ వంటి హిమాలయ ప్రాంతాలలో భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయని తెలిపారు. భౌగోళిక కదలికల వల్ల పెద్ద ఎత్తున శక్తి ఉత్పత్తి అవుతోంది. దీంతో బీహార్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా వరకు భూకంప ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై తక్కువగా ఉన్న భూకంపాలు భవిష్యత్తులో పెద్ద భూకంపాలు సంభవించవని సూచన కాదు. బీహార్ నుండి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా వరకు విస్తరించి ఉన్న సెంట్రల్ సిస్మిక్ గ్యాప్ వల్ల ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తాయని తెలిపారు.

నేపాల్‌లోనూ భూప్రకంపనలు

మరోవైపు.. నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున గంట వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. నేషనల్ ఎర్త్‌క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేపాల్ ప్రకారం.. బగ్‌లుంగ్ జిల్లాలో ప్రకంపనల తీవ్రత 4.7, 5.3గా నమోదైంది. నివేదికల ప్రకారం.. నేపాల్‌లోని బగ్లుంగ్‌లో తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య (స్థానిక కాలమానం) భూకంపం సంభవించింది,

ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం నివేదించబడలేదు. NEMRC రీడింగుల ప్రకారం.. తెల్లవారుజామున 01:23 గంటల ప్రాంతంలో బగ్లుంగ్ జిల్లాలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. రెండవ భూకంపం బగ్లుంగ్ జిల్లాలోని ఖుంగా ప్రాంతంలొ తెల్లవారుజామున 02:07 గంటల ప్రాంతంలో  భూప్రకంపనాలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని NEMRC ట్వీట్ చేసింది.
 

click me!