సరదాగా లేడీ డ్రెస్ వేసుకున్నందుకు ఆ యువకుడిని...

Published : Oct 19, 2018, 08:00 PM IST
సరదాగా లేడీ డ్రెస్ వేసుకున్నందుకు ఆ యువకుడిని...

సారాంశం

తాను మహిళా దుస్తులు ధరించిన వీడియోపై స్నేహితులు కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నై నగరంలోని కన్నికాపురానికి చెందిన కె.కలైయరసన్(24) అనే యువకుడు నటన అంటే విపరీతమైన పిచ్చి. ఈ నేపేథ్యంలో వివిధ వేషధారణలతో తాను నటించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ సంతోషపడేవాడు. 

చెన్నై: తాను మహిళా దుస్తులు ధరించిన వీడియోపై స్నేహితులు కామెంట్స్ చేయడంతో తట్టుకోలేక ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే చెన్నై నగరంలోని కన్నికాపురానికి చెందిన కె.కలైయరసన్(24) అనే యువకుడు నటన అంటే విపరీతమైన పిచ్చి. ఈ నేపేథ్యంలో వివిధ వేషధారణలతో తాను నటించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ సంతోషపడేవాడు. 

వివిధ వేషాధారణలతో వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడం అలవాటుగా చేసుకున్నాడు. అయితే ఇటీవలే మహిళా దుస్తువులు వేసుకుని ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే సోషల్ మీడియాలో తన స్నేహితులు ఆ వీడియోను షేర్ చేస్తూ ఎగతాళి చేశారు.  

స్నేహితులతోపాటు ఫాలోవర్లు అతడిని అభ్యంతరకంగా ఎగతాళి చేశారు. ట్రాన్స్‌జెండర్, నపుంసకుడు అంటూ కామెంట్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కలైయరసన్  రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి చనిపోయాడు. తాను ఎన్నో వీడయాలు చేశాను. మగవారి వేషధారణలో చాలానే వీడియోలు అప్‌లోడ్ చేశాను. అయితే మొదటిసారి మహిళా వేషధారణలో ఒక వీడియో అప్‌‌లోడ్ చేస్తే  తనను ఇంత నిర్ధాక్షిణ్యంగా ఎగతాళి చేస్తున్నారు. కొందరు తనను బెదిరిస్తున్నారు అని వీడియోలో కలైయరసన్ వాపోయాడు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు కలైయరసన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలంలో మృతుడి ఫోన్ లభించలేదని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు చెప్పారు. అతడి సోషల్ మీడియా అకౌంట్ పరిశీస్తున్నామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్