కూతురితో ప్రేమాయణం..యువకుడిని సజీవదహనం చేసిన యువతి పేరేంట్స్

Siva Kodati |  
Published : Feb 24, 2019, 12:00 PM IST
కూతురితో ప్రేమాయణం..యువకుడిని సజీవదహనం చేసిన యువతి పేరేంట్స్

సారాంశం

తమ కుమార్తెను ప్రేమించాడనే అక్కసుతో యువకుడిని సజీవ దహనం చేశారు అమ్మాయి కుటుంబసభ్యులు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఢిల్లీకి చెందిన రంజిత్ మొండల్ అనే యువకుడు స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు.

అతని తల్లి చనిపోవడంతో తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు. దీనిని తట్టుకోలేని రంజిత్ తన మేనమామతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మిడ్నాపూర్‌కే చెందిన ఓ యువతితో రంజిత్ ప్రేమలో పడ్డాడు.

ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం ఆమెను కలిసేందుకు రావడంతో మాటేసిన కుటుంబసభ్యులు రంజిత్‌ను పట్టుకుని అక్కడే తీవ్రంగా కొట్టారు.

అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి తగలబెట్టారు. రాత్రిపూట పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు ఏదో కాలుతున్నట్లు గమనించి అక్కడికి వెళ్లారు. అక్కడ రంజిత్ మొబైల్ దొరకడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?