ఘాటు ప్రేమ : నలుగురు పిల్లల తల్లైన 41 యేళ్ల మహిళను పెళ్లాడిన.. 21యేళ్ల యువకుడు...!

Published : Aug 21, 2021, 08:37 AM IST
ఘాటు ప్రేమ : నలుగురు పిల్లల తల్లైన 41 యేళ్ల మహిళను పెళ్లాడిన.. 21యేళ్ల యువకుడు...!

సారాంశం

41 ఏళ్ల మహిళ, 21 యేళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు కూడా ఆమె ప్రేమలో పీకలోతుల్లో మునిగిపోయాడు. ఇది తెలిసిన గ్రామస్తులు వారిద్దరి మీదా నిఘా పెట్టారు.

బీహార్ : పెళ్లి అంటే ఈడు, జోడు.. బాగుందా అని చూస్తారు. అబ్బాయి, అమ్మాయిలకి వయసు తేడా ఎక్కువగా లేకుండా...ఉండేలా చూసుకుంటారు. చూడచక్కని జంటలా ఉండాలని కోరుకుంటారు. అయితే ఖగడియాలో మాత్రం ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. 

41 ఏళ్ల మహిళ, 21 యేళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు కూడా ఆమె ప్రేమలో పీకలోతుల్లో మునిగిపోయాడు. ఇది తెలిసిన గ్రామస్తులు వారిద్దరి మీదా నిఘా పెట్టారు. ఓ రోజు ఆ మహిళ ఇంట్లో వారిద్దరినీ పట్టుకున్నారు. ఇంకేముంది.. ఇద్దరికీ పెళ్లి చేశారు. ఇప్పుడీ ప్రేమాయణం, పెళ్లి బీహార్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

బీహార్లోని ఖగడియా జిల్లా దరియాపూర్ పంచాయతీ పరిధి నయాగావ్ కు చెందిన మనతి దేవికి 45 ఏళ్ళు.  ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్దికాలం క్రితమే భర్త మరణించాడు. కాగా,  జొరావర్ పుర్ కు చెందిన రవికుమార్ (21) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రవికుమార్ తరచూగా మనతిదేవి ఇంటికి వస్తుండేవాడు.  వీరిద్దరి వ్యవహారాన్ని ఎప్పటినుంచో అనుమానిస్తున్న గ్రామస్తులు మనతి ఇంట్లో రవికుమార్ ఉండడంతో అతడిని పట్టుకున్నారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దరియాపూర్ సర్పంచ్ శంబుసింగ్,  జొరావ్ పూర్ సర్పంచ్ పంకజ్ షా మనతి ఇంటికి చేరుకుని గ్రామస్తులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారిద్దరికీ వివాహం జరిపించారు.  మొత్తం నలుగురు సంతానంలో ఇద్దరు పిల్లలు కొత్త జంట దగ్గర,  మరోఇద్దరిని మనతి తల్లి వద్ద ఉంచేలా ఒప్పందం కుదిర్చారు.

PREV
click me!

Recommended Stories

ఉత్తరాఖండ్‌లో గ్యాస్ కొరత.. హోటల్స్ లో ఏం చేశారో చూడండి | LPG Shortage | Asianet News Telugu
జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంలో Aviation Minister Rammohan Naidu Speech| Asianet News Telugu