అర్ధరాత్రి పడకగదిలోకి ప్రవేశించిన కామాంధుడు.. భర్తను హత్య చేసి.. మృతదేహం పక్కనే భార్యపై లైంగిక దాడి.. 

Published : Aug 04, 2023, 06:44 PM ISTUpdated : Aug 04, 2023, 06:59 PM IST
అర్ధరాత్రి పడకగదిలోకి ప్రవేశించిన కామాంధుడు.. భర్తను హత్య చేసి.. మృతదేహం పక్కనే భార్యపై లైంగిక దాడి.. 

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లోని హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని హత్య చేసి.. అతని భార్యను బెదిరించి..  రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. 

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ కామాంధుడు అత్యంత కిరాతంగా ప్రవర్తించాడు.  భర్తను హత్య చేసి.. అనంతరం రక్తం మడుగుల్లో పడి ఉన్న మృతదేహం పక్కనే అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై సెక్షన్ 302, 376, 506 కింద చర్యలు తీసుకుని జైలుకు తరలించారు.  

అర్ధరాత్రి పడకగదిలోకి ప్రవేశించిన కామాంధుడు 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. అంబికాపూర్‌కు చెందిన 42 ఏండ్ల సుఖ్‌లాల్‌ సోమవారం రాత్రి భార్యతో కలిసి ఇంట్లో నిద్రించాడు. రాత్రి 12 గంటల సమయంలో తన భార్యకు పరిచయం ఉన్న కార్తీక్ కోర్వా (21) అనే వ్యక్తి వారి ఇంట్లోకి నిశ్శబ్దంగా ప్రవేశించాడు. ఇది గమనించిన సుఖ్‌లాల్‌ నిద్ర లేచాడు. కార్తీక్‌ను చూసిన సుఖ్‌లాల్‌.. ఆ వ్యక్తికి తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో కార్తీక్‌ కర్రతో సుఖ్‌లాల్‌ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు చనిపోయాడు.

హత్య చేసిన తర్వాత  సుఖ్‌లాల్ భార్యను నిందితుడు బెదిరించాడు. రక్తం మడుగుల్లో పడి ఉన్న భర్త మృతదేహం పక్కనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా దరిమా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంపాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు కార్తీక్ కోర్వాను పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!