క‌రోనావైర‌స్ కార‌ణంగా 21 మంది మృతి.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే.. ?

By Mahesh Rajamoni  |  First Published Apr 11, 2023, 1:41 PM IST

New Delhi: కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండ‌టంతో భ‌యాందోళ‌న‌లు అధిక‌మ‌వుతున్నాయి. దేశంలో కొత్తగా 5676 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనావైర‌స్ యాక్టివ్ కేసులు 37 వేలు దాటాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇప్పటివరకు చాలా తక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
 


covid-19 update india: దేశంలో క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి పెరుగుతుండ‌టంతో భ‌యాందోళ‌న‌లు అధిక‌మ‌వుతున్నాయి. దేశంలో కొత్తగా 5676 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా వైర‌స్ యాక్టివ్ కేసులు 37 వేలు దాటాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ఇప్పటివరకు చాలా తక్కువ కేసులు ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. భారత్ లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుండటం ప్రజలను భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 5,676 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో కరోనా బారిన పడి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 53,10,000కి చేరింది. అదే సమయంలో కోవిడ్ ను జయించి కోలుకున్న రోగుల సంఖ్య 4 కోట్ల 42 లక్షలు దాటింది. మొత్తం రికవరీ రేటు 98.73 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు భారత్ లో 220.66 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ల‌ను ప్ర‌జ‌ల‌కు అందించారు. కరోనా ముప్పు పెరుగుతున్న దృష్ట్యా సోమవారం (ఏప్రిల్ 10) దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ, ప్ర‌యివేటు ఆసుపత్రుల ఏర్పాట్లను పరిశీలించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఇందులో అతిపెద్ద ఆసుపత్రి ఎల్ఎన్జేపీ కూడా ఉంది. సోమవారం నుంచి ముంబ‌యిలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. మాక్ డ్రిల్ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులు ఆసుపత్రుల్లో సౌకర్యాల సన్నద్ధత, సామర్థ్యాలను సమీక్షించారు.

Latest Videos

undefined

కోవిడ్-19 నివార‌ణ ఏర్పాట్ల పరిశీలన 

ఏప్రిల్ 7న జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఆసుపత్రులను సందర్శించి మాక్ డ్రిల్ తో పాటు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ సన్నద్ధతను పరిశీలించాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరారు. అదే సమయంలో కోవిడ్ నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది. 

విదేశీ ప్ర‌యాణికుల‌కు కోవిడ్ ప‌రీక్ష‌లు

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో యాక్టివ్ కోవిడ్ -19 రోగుల సంఖ్య ఈ ఏడాది మొదటిసారిగా 300 మార్కును దాటినందున, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సోమవారం జిల్లా వాసులకు విజ్ఞప్తి చేసింది. క‌రోనా వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా గ్రేట‌ర్ నోయిడా, ఘ‌జియాబాద్ కు వచ్చే విదేశీ ప్ర‌యాణాలు చేసిన వారికి క‌రోనా ప‌రీక్ష‌ల‌ను అధికారులు త‌ప్ప‌నిస‌రి చేశారు.

click me!