విహార యాత్రలో విషాదం.. బస్సు బోల్తా పడి  ఇద్దరు విద్యార్థుల మృతి .. మరికొందరి పరిస్థితి..

By Rajesh KarampooriFirst Published Dec 11, 2022, 11:18 PM IST
Highlights

మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలోని  ఖోపోలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మహారాష్ట్ర బస్సు ప్రమాదం: మహారాష్ట్రలోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటన రాయ్‌గఢ్‌లోని ఖోపోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 11) చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 48 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా బస్సు బోల్తా పడిందని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ గౌరీ మోర్ పాటిల్ తెలిపారు.  

ఈ బస్సు ముంబై పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు ముంబైలోని చెంబూరు నుంచి మావల్‌కు బయలుదేరింది. ఈ బస్సు మావల్‌లో ఉన్న థీమ్ పార్క్‌కు వెళ్లింది. మావల్ నుంచి తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను ఖోపోలిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. ఈ ఘటనపై ఖోపోలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేస్తున్నారు.  

click me!