జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి

Published : Nov 26, 2020, 04:43 PM IST
జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి.. ఇద్దరు సైనికులు మృతి

సారాంశం

ఈ దాడిపై  సమాచారం అందుకున్న సిఆర్‌ఎపిఎఫ్‌ బలగాలు, జమ్మూకాశ్మీర్‌ ఎస్‌ఒసి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

 జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. శ్రీనగర్‌లో గురువారం ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు.  శ్రీనగర్ శివారులోని హెచ్‌ఎంటి వద్ద ఈ ఘటన జరిగింది.  ఇండియన్ ఆర్మీ రోడ్ ఓపెనింగ్ పార్టీ (ఆర్‌ఒపి) పై ఉగ్రవాదులు దాడి చేసినట్టు అధికారులు తెలిపారు. 

ఈ దాడిపై  సమాచారం అందుకున్న సిఆర్‌ఎపిఎఫ్‌ బలగాలు, జమ్మూకాశ్మీర్‌ ఎస్‌ఒసి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలయరాలేదు.  26/11 ముంబయి ఉగ్రవాద దాడి జరిగి గురువారంతో పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో శ్రీనగర్‌ లో సైనికులపై ఉగ్రవాదులు దాడులు జరపడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ నెల 28, డిసెంబర్ 22 మధ్య డిసిసి ఎన్నికలు జరగునన్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో హైఅలర్ట్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

నిర్మాత తిని ప‌డేసిన బొక్క‌లు తిన్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎందుక‌ని అడ‌గ్గా, ఊహ‌కంద‌ని ఆన్స‌ర్‌
Viral Video: ఏసీలో నుంచి వింత శ‌బ్ధాలు.. ఏంటా అని చూడ‌గా గుండె గుబేల్‌, వైర‌ల్ వీడియో