డీజీపీనే గుర్తించకుండా.. ఐడీ కార్డ్ అడిగినందుకు.. ఇద్దరు పోలీసుల సస్పెండ్

By sivanagaprasad KodatiFirst Published Sep 13, 2018, 11:39 AM IST
Highlights

ఏకంగా రాష్ట్ర పోలీస్ బాస్‌నే గుర్తించకపోవడమే కాకుండా విధుల్లో ఉండి క్రమశిక్షణతో లేనికారణంగా ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు.. ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్‌ బుధవారం ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో సమావేశంలో పాల్గొని తిరిగి అధికారిక వాహనంలో వెంట కాన్వాయ్ లేకుండా నోయిడా మీదుగా వెళుతున్నారు.

ఈ క్రమంలో నోయిడాలోని అమ్రపాలి చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఐ హరిభాన్‌సింగ్, కానిస్టేబుల్ యోగేష్ కుమార్‌లు టోపీలు ధరించకుండా నిలబడి ఉన్నారు. వీరిని చూసిన డీజీపీ కారును చెక్‌పోస్ట్ వద్ద ఆపమని డ్రైవర్‌ను ఆదేశించారు. అయితే మఫ్టీలో డీజీపీని ఇద్దరు పోలీసులు గుర్తించక శాల్యూట్ చేయలేదు.. దీంతో పాటు డీజీపీనే ఐడీ కార్డ్ అడిగారు..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓపీ సింగ్ ఇద్దరు పోలీసులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఈ ఏడాది జనవరి 1న ఉత్తరప్రదేశ్ డీజీపీగా ఓపీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ చీఫ్‌గా, జాతీయ విపత్తు స్పందన దళం, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీగా ఓపీ సింగ్ గతంలో సేవలందించారు.
 
click me!