రూ.5కోట్లు విలువచేసే బంగారం స్మగ్లింగ్.. ఇద్దరి అరెస్ట్

By telugu teamFirst Published Oct 11, 2019, 7:36 AM IST
Highlights

ఇటీవల కేరళలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. కేరళాలోని మలప్పురానికి చెందిన నౌషద్ అనే వ్యక్తి షార్జా నుంచి కేరళా వచ్చాడు. ఈ సందర్భంగా అతడు తన జుట్టు మధ్య వెంటుకలను పూర్తిగా తొలగించి, 1.13 కిలోల బరువు గల బంగారం పొడిని మూటలా చుట్టి పెట్టుకున్నాడు.

విదేశాల నుంచి స్మగ్లింగ్  చేసిన రూ.5కోట్ల బంగారం బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని ఝార్సీగూడ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. 

ఝార్సీగూడ రైల్వేస్టేషనులోని జానేశ్వరి సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇద్దరు వ్యక్తులు 12.9 కిలోల బరువున్న 110 విదేశీ బంగారం బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. విదేశీ బంగారం స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశామని అధికారులు వివరించారు.

కాగా... ఆ మధ్యకాలంలో బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలు ఎక్కువౌతున్నాయి. ఇటీవల కేరళలో కూడా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. కేరళాలోని మలప్పురానికి చెందిన నౌషద్ అనే వ్యక్తి షార్జా నుంచి కేరళా వచ్చాడు. ఈ సందర్భంగా అతడు తన జుట్టు మధ్య వెంటుకలను పూర్తిగా తొలగించి, 1.13 కిలోల బరువు గల బంగారం పొడిని మూటలా చుట్టి పెట్టుకున్నాడు. అనంతరం దాన్ని విగ్గుతో కప్పేశాడు. భద్రత అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు అతడి జుట్టుపై అనుమానం కలిగింది. 

అది విగ్గు అని అనుమానం రావడంతో దాన్ని తెరిచి చూపించాలని కోరారు. దీంతో నౌషద్ విగ్గు తీయక తప్పలేదు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నాడనే కారణంతో భద్రతా అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబరు నెలలో ఢిల్లీ విమానాశ్రయంలో ఓ వ్యక్తి పురీష నాళంలో బంగారాన్ని పెట్టుకుని యూఏఈ నుంచి ఇండియాకు వచ్చి దొరికిపోయాడు. మొత్తం 817 గ్రామాల బంగారాన్ని అక్కడి నుంచి తొలగించారు.

click me!