1994 నాటి ఇస్రో గూఢచార్యం కేసు.. సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

By Siva KodatiFirst Published Dec 2, 2022, 2:38 PM IST
Highlights

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల నలుగురు నిందితుకు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్‌లపైనా మరోసారి విచారణ జరపాలని కేరళ హైకోర్టును సుప్రీంకోర్ట్ కోరింది. 

1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ వివాదంలో ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను ఇరికించిన కేరళ మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు (మాథ్యూస్, గుజరాత్ మాజీ ఏడీజీపీ ఆర్బీ శ్రీకుమార్, కేరళకు చెందిన ఇద్దరు మాజీ పోలీసు అధికారులు ఎస్ విజయన్, తంపి ఎస్ దుర్గావత్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి పీఎస్ జయప్రకాశ్‌) సుప్రీంకోర్ట్ షాకిచ్చింది. ఇటీవల వారికి బెయిల్ మంజూరు చేస్తూ కేరళ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్‌లపైనా మరోసారి విచారణ జరపాలని కేరళ హైకోర్టును సుప్రీంకోర్ట్ కోరింది. 

అయితే నలుగురు నిందితులను ఐదు వారాలా పాటు అరెస్ట్ చేయొద్దని సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సదరు నిందితులకు మంజూరు చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ నవంబర్‌లో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తమను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని పిటిషనర్లలో ఒకరి తరపు న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. 
 

click me!