ప్రియుడితో లేచిపోతోందని.. యువతిని చితకబాదారు

Published : Sep 04, 2019, 11:34 AM IST
ప్రియుడితో లేచిపోతోందని.. యువతిని చితకబాదారు

సారాంశం

అలీరాజ్ పూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల దళిత యువతి ఇంట్లో వారికి తెలికుండా ఓ యువకుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... ఆమెను కుటుంబసభ్యులు పట్టుకొని కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ఫోన్ నుంచి మరో ఫోన్ కి చేరి చివరకు ఈ వీడియో పోలీసుల కంట పడింది.

ప్రియుడితో లేచిపోయేందుకు పథకం వేసింది. ఇంట్లో ఎవరూ చూడట్లేదని నిశ్చయించుకొని... ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధపడింది. కానీ... ఆ ప్లాన్ ని కుటుంబసభ్యులు పసిగట్టారు. పారిపోతున్న యువతిని పట్టుకున్నారు. రోడ్డు మీదే కర్రలతో దారుణంగా కొట్టుకుంటూ ఇంటిదాకా నడిపించుకుంటూ తీసుకువచ్చారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కాగా... అలీరాజ్ పూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల దళిత యువతి ఇంట్లో వారికి తెలికుండా ఓ యువకుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... ఆమెను కుటుంబసభ్యులు పట్టుకొని కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ఫోన్ నుంచి మరో ఫోన్ కి చేరి చివరకు ఈ వీడియో పోలీసుల కంట పడింది.

కాగా... తనను కొట్టవద్దని బాలిక వేడుకోవడం ఆవీడియోలో స్పష్టంగా కనపడుతోంది. అయితే.. రోడ్డు మీద వెళ్లేవారు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. అయితే.. ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. బాధిత యువతి, ఆమో తండ్రితో మాట్లాడామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇంట్లో గోనె సంచుల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం
Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ