గణేష్ మండపంలో తాగి.. యువకుల చిందులు

Published : Sep 04, 2019, 09:01 AM IST
గణేష్ మండపంలో తాగి.. యువకుల చిందులు

సారాంశం

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని మహిధర్‌పుర ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్ నగరంలోని గోల్వాడ ప్రాంతంలోని మహీధర గణేశ్ పూజా మండపంలోనే వినాయకుడి విగ్రహం వద్ద 8 మంది యువకులు బీరు తాగుతూ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. 

పవిత్రమైన గణేష్ మండపంలో కొందరు యువకులు మద్యం సేవించారు. అక్కడితో ఆగలేదు... డ్యాన్సులు కూడా వేశారు. అంతేకాకుండా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ కావడంతో పోలీసుల దాకా విషయం వెళ్లింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని మహిధర్‌పుర ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్ నగరంలోని గోల్వాడ ప్రాంతంలోని మహీధర గణేశ్ పూజా మండపంలోనే వినాయకుడి విగ్రహం వద్ద 8 మంది యువకులు బీరు తాగుతూ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు. 

అత్యంత భక్తిప్రపత్తులతో గణనాధుడికి పూజలు చేయాల్సిన యువకులు మద్యం మత్తులో జోగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేశారు. ఈ డాన్స్ వీడియో వైరల్ కావడంతో సూరత్ పోలీసులు రంగంలోకి దిగి మద్యం తాగుతూ డాన్స్ చేసిన 8 మంది యువకులను అరెస్టు చేశారు. ఈ ఘటన గణేశ్ ఉత్సవాల్లో సంచలనం రేపింది.
 
PREV
click me!

Recommended Stories

IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే