షాకింగ్.. డాసనా జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్..

By SumaBala Bukka  |  First Published Nov 19, 2022, 6:44 AM IST

ఉత్తరప్రదేశ్ లోని ఓ జైలులో 140మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం ఈ జైలులో 5500 మంది ఖైదీలు ఉన్నారు. 


ఉత్తర ప్రదేశ్ :యూపీలోని ఘజియాబాద్ జిల్లాలోని ఓ జైలులో భారీ స్థాయిలో హెచ్ఐవి కేసులు బయటపడ్డాయి. ఘజియాబాద్ లోని డాసనా జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడ ఇన్మేట్స్ గా ఉన్న 140 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఈ మేరకు జైలు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. జైలుకు తరలించే ముందు ఖైదీల అందరికీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 2016లో ఘజియాబాద్ తో సహా రాష్ట్రంలోని అన్ని జైళ్లలో హెచ్ఐవి స్క్రీనింగ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. అయితే, ఈ స్క్రీనింగ్ లో అప్పట్లో 49 మందికి మాత్రమే ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. ఇది అదికారులను ఆందోళనలో పడేసింది. అప్పటినుంచి జైళ్లలో ఖైధీలనకు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షల్లో ఒకవేళ ఎవరైనా ఖైదీకి, హెచ్ఐవి నిర్ధారణ అయితే.. వారిని మిగతా ఖైదీలతో వేరు చేసి.. అక్కడే ఉండే ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ లో (ఐసీటీసీ) ఏఆర్ వీ చికిత్సను అందిస్తున్నారు.

Latest Videos

కాగా, ఘజియాబాద్ జైలు ఖైదీల సామర్ధ్యం 1706 మంది.. కానీ ప్రస్తుతం అక్కడ దీనికి మూడొంతులు ఎక్కువగా 5500 మంది ఉన్నట్లు సమాచారం. ఇక వీరికి టెస్టులు చేయగా.. అందులో  140 మందికి హెచ్ఐవి నిర్ధారణ అయిందని తెలిసింది. కాగా, వారిలో 35 మందికి క్షయవ్యాధి కూడా సోకిందని సమాచారం. అయితే, షాకింగ్ విషయం ఏంటంటే అ జైల్లో 2016 నుంచి సరాసరి 120 నుంచి 150 మంది హెచ్ఐవి సోకిన ఖైదీలు ఉంటున్నారు. 

భార‌త్ జోడో యాత్ర‌కు బెదిరింపులు.. ఇండోర్ స్టేడియంలో పేలుళ్ల హెచ్చ‌రిక‌లు

click me!