రక్తం ఎక్కించిన 14 మంది పిల్లలకు హెచ్ఐవీ.. బీజేపీ ప్రభుత్వంపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

By Mahesh K  |  First Published Oct 25, 2023, 2:42 PM IST

ఉత్తరప్రదేశ్‌లో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు కాన్పూర్‌లోని ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో రక్తమార్పిడి చేశారు. ఈ రక్తమార్పిడి తర్వాత పలువురు పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. మళ్లీ వారికి వైద్య పరీక్షలు చేయగా.. హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీలు సోకినట్టు తేలిందని ఖర్గే ఫైర్ అయ్యారు. 
 


న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో రక్తం ఎక్కించారు. ఆ తర్వాత వారు అనారోగ్యానికి గురయ్యారు. వారికి వైద్య పరీక్షలు చేయగా 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకినట్టు తెలిసింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికార బీజేపీపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. డబుల్ ఇంజిన్ సర్కారులో అనారోగ్యాలు డబుల్ అవుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.

కాన్పూర్ ప్రభుత్వ హాస్పిటల్ ఆధ్వర్యంలోని లాలా లజపతిరాయ్ హాస్పిటల్‌లో 14 మంది పిల్లలకు రక్త మార్పిడి చేయగా.. 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకినట్టు తెలిసింది. రక్తం ఎక్కించిన తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీలు సోకినట్టు తెలిసింది.

Latest Videos

undefined

డబుల్ ఇంజిన్ సర్కారు రోగాలను డబుల్ చేస్తున్నదని మల్లికార్జున్ ఖర్గే ఈ ఘటనను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తలసేమియాతో బాధపడుతున్న 14 మంది పిల్లలకు హెచ్ఐవీ సోకిన రక్తాన్ని అందించారని ఫైర్ అయ్యారు. సర్కారు చేసిన తప్పునకు పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. ఇది బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు.

Also Read: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

బాధిత పిల్లల వయసు ఆరేళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ఉన్నది. ఏడుగురికి హెపటైటిస్ బీ, ఐదుగురికి హెపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్ఐవీ అని వైద్య పరీక్షల్లో తేలినట్టు సమాచారం.

click me!