తలనొప్పని వెడితే.. గర్భవతి అని తేలింది.. పదమూడేళ్ల బాలికను ఇన్ స్టాలో ఫాలో అయ్యి.. అంకుల్ చేసిన పని...

Published : Jan 22, 2022, 02:01 PM IST
తలనొప్పని వెడితే.. గర్భవతి అని తేలింది.. పదమూడేళ్ల బాలికను ఇన్ స్టాలో ఫాలో అయ్యి.. అంకుల్ చేసిన పని...

సారాంశం

ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. తరువాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేస్తూ మాట్లాడేవాడు. అలా అతడు బాలికను ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలోనే నిరుడు డిసెంబర్ నెల మొదటివారంలో అతడు బాలికకు ఫోన్ చేసి తనని కలవాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె ప్రియుడిని కలవడానికి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. అలా ఇద్దరూ బయట కాసేపు మాట్లాడుకున్న తరువాత అతడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.   

ఛత్తీస్ గఢ్ : Chhattisgarhలోని రాయ్ పూర్ ప్రాంతానికి చెందిన 13 యేళ్ల బాలిక Instagram ఖాతాలో ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ఎప్పటికప్పుడు ఫొటోలు దిగి అప్ లోడ్ చేసేది. అయితే అదే ప్రాంతానికి చెందిన 25యేళ్ల వ్యక్తి ఆమెను ఇన్ స్టాలో Follow అవడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఆమెను ఆకర్షించడానికి బాలిక షేర్ చేసిన ప్రతీ ఫొటోను లైక్ చేస్తూ.. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్ చేసేవాడు. అలా కొద్ది రోజుల తరువాత ఆమెకు అతడికి పరిచయం పెరిగింది. 

ఈ క్రమంలోనే వారిద్దరూ ఒకరి ఫోన్ నెంబర్లు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. తరువాత ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేస్తూ మాట్లాడేవాడు. అలా అతడు బాలికను ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలోనే నిరుడు డిసెంబర్ నెల మొదటివారంలో అతడు బాలికకు ఫోన్ చేసి తనని కలవాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె ప్రియుడిని కలవడానికి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది. అలా ఇద్దరూ బయట కాసేపు మాట్లాడుకున్న తరువాత అతడు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. 

అక్కడ బాలిక మీద molestation చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించాడు. దీంతో బాలిక ఎవరికీ చెప్పకుండా అలాగే ఉండిపోయింది. అయితే ఇటీవల కొద్ది రోజుల క్రితం నుంచి ఆమెను తలనొప్పి వేధిస్తోంది. మాత్రలు వేసుకున్నా ఎంతకీ తగ్గకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పాడు. అది విన్న తల్లిదండ్రులు కంగుతిన్నారు. వారికి ఏమీ అర్థం కాలేదు. ఈ విషయం మీద బాలికను గట్టిగా నిలదీయగా జరిగిందంతా చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చిన్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో ఈ ఘటన చెబుతోంది. ఇటీవలి కాలంలో తల్లిదండ్రులు పుట్టిన పిల్లలకు కూడా ఇన్ స్టా, ట్విటర్ లలో అకౌంట్లు తీసి వారి ఫొటోలు.. వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసీ తెలియని అమాయకపు పిల్లల్ని ఇలా బలయ్యేలా చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, ఒంటరిగా వెడుతున్న గిరిజన married womanను ఇద్దరు దుండగులు పట్టపగలే దారిలో అడ్డగించి gang rapeకి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తేరుకున్న బాధిత woman ఒంటిమీద చీర లేకుండానే 500 మీటర్ల దూరంలో ఉన్న బాఘ్ పురా చౌక్ కు వెళ్లింది. అక్కడ ఉన్నవాళ్లకు తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. 

వారి సాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ అమానుషన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పుర్ జిల్లాలో వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే ఉదయ్ పుర్ ఎస్పీ మనోజ్ చౌదరి, ఝాఢోల్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మహిళ చీర ఓ చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పరిసర ప్రాంతం వారేనని అనుమానిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించి.. వారి కోసం గాలింపు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu