వీడియో గేమ్ లోని సీన్ రీ క్రియేట్ చేస్తూ... 11 అంతస్తుల భవనం నుంచి దూకిన 12యేళ్ల బాలుడు..

Published : Feb 08, 2022, 09:48 AM IST
వీడియో గేమ్ లోని సీన్ రీ క్రియేట్ చేస్తూ... 11 అంతస్తుల భవనం నుంచి దూకిన 12యేళ్ల బాలుడు..

సారాంశం

కోల్ కతాలో విషాదం చోటు చేసుకుంది. వీడియో గేమ్స్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. యానిమేషన్ సిరీస్ లోని ఓ సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తూ 12యేళ్ల బాలుడు 11 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో విషాదఘటన జరిగింది. వీడియో గేమ్స్ కు అలవాటు పడిన ఓ బాలుడు అనుకోకుండా ప్రాణాలు కోల్పోయాడు. Animation series లోని ఓ సన్నివేశాన్ని Reconstruct చేసే ప్రయత్నంలో 12 యేళ్ల బాలుడు 11 అంతస్తుల భవనం మీదినుంచి కిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని 
Kolkataలో చోటు చేసుకుంది. స్థానిక పూల్ బగన్ ప్రాంతానికి చెందిన బిరాజ్ పచిసియా అయిదో తరగతి చదువుతున్నాడు. 

శనివారం 11 storey building మీదినుంచి బిరాజ్ కిందకు పడిపోవడంతో స్థానికులు ఓ Private Nursing Homeలో చేర్పించారు. అప్పటికే ఆ బాలుడు Died అని వైద్యులు ధృవీకరించారు. యానిమేషన్ సిరీస్ లోని సన్నివేశాన్ని రీ కన్ స్ట్రక్ట్ చేసే ప్రయత్నంలో ఎత్తైన భవనం మీదినుంచి బిరాజ్ దూకినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. 

విచక్షణను చంపేసే ఇలాంటి గేమ్స్ ను పిల్లలకు దూరంగా ఉంచాలని.. తల్లిదండ్రులకు పోలీసులు హితవు పలికారు. అప్పటివరకు ఆడుకుంటున్న బాలుడు అంతలోనే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. 

ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు పబ్జీ గేమ్ విషయంలో జరగడం చూశాం. గత నెల 29న పబ్జీకి అడిక్ట్ అయిన ఓ బాలుడు దారుణానికి తెగబడిన ఘటన కలకలం రేపింది. నిత్యం PUBG game ఆడుతూ దానికి బానిసైన ఓ బాలుడు ఏకంగా తన కుటుంబ సభ్యులను కడతేర్చాడు. తల్లి, సోదరుడుతో పాటు ఇద్దరు సోదరీమణులను shoot చేసిచంపాడు. ఈ దారుణ ఘటన Pakistanలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. Lahoreలోని కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్ ముబారక్ (45) హెల్త్ వర్కర్ గా పనిచేస్తోంది.  కొన్నేళ్ళ క్రితమే భర్తతో విడిపోయి.. పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. అయితే 14 ఏళ్ల కుమారుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ.. నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ.. దానికి బానిస అయ్యాడు. educationను పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో తల్లి పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయమై కుమారుడిని ఘటన జరిగిన రోజు మళ్లీ మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కబోర్డ్ లో ఉన్న Gun తీసుకుని తల్లితో పాటు  సోదరుడు (22), ఇద్దరు సోదరీమణులు (17), (11)లను కాల్చి చంపాడు.

ఆ తర్వాత తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటి వారికి తెలియజేశాడు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకు ఏమీ తెలియదని.. ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపైన ఉన్నానని బాలుడు బుకాయించాడు అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో.. నిజం అంగీకరించాడు. 

హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. సంఘటన సమయంలో అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పబ్జి కి బానిసై పోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం తరలించినట్లు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

ఘనంగా గణతంత్ర వేడుకలు | ప్రధాని మోడీ సెక్యూరిటీ చూశారా | Republic Day 2026 | Asianet News Telugu
Republic Day 2026 | Spectacular Cultural Performances at Grand Parade at Delhi | Asianet News Telugu