భార్య, కూతురిని గొంతుకోసి చంపిన 89యేళ్ల మాజీ ఆర్మీ ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే మనసు చలిస్తుంది...

Published : Feb 08, 2022, 09:11 AM IST
భార్య, కూతురిని గొంతుకోసి చంపిన 89యేళ్ల మాజీ ఆర్మీ ఉద్యోగి.. ఎందుకో తెలిస్తే మనసు చలిస్తుంది...

సారాంశం

ముంబాయిలో ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి తెగబడ్డాడు. మంచానికి పరిమితం అయిన భార్య, కూతురి వేదన చూడలేక.. వారికి సేవలు చేసే ఓపిక లేక.. వంటింటి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. వారికి బాధలనుంచి విముక్తి కలిగించానని ప్రశాంతంగా చెబుతున్న అతని మాటలు వింటుంటే.. ఎటువంటి వారికైనా మనసు చలిస్తుంది.. 

ముంబై : Mumbaiలో దారుణం చోటు చేసుకుంది. ఓ 89 ఏళ్ల ex-Army man తన భార్య, కూతురిని గొంతుకోసి అంత్యంత పాశవికంగా murder చేశాడు. ఈ ఘట ఆదివారం సాయంత్రం తూర్పు అంధేరిలోని వారి ఫ్లాట్‌లో జరిగింది. సోమవారం ఉదయం సదరు వృద్ధుడు.. 81 ఏళ్ల భార్య, 55 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురి బాధలను చూడలేక వారి throats slit  చేసి చంపేశానని చెబుతూ మేఘ్‌వాడి పోలీసుల ముందు లొంగిపోయాడు. 

నిందితుడిని పురుషోత్తం సింగ్ గంధోక్ గా గుర్తించారు. తన భార్య, కుమార్తెలను పదేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్నానని.. వీరిద్దరూ bed ridden అయ్యారని.. పదేళ్లుగా వారిని చూసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చాడు. ఇక మీదట వారు బాధపడటం తనకు ఇష్టం లేదని పోలీసులకు చెప్పాడు.

హత్యల సమాచారం తెలిసి పోలీసులు సోమవారం ఉదయం.. అంధేరీలోని షేర్-ఏ-పంజాబ్ కాలనీలోని ప్రేమ్ సందేశ్ సొసైటీలోని అతని ఫ్లాట్‌లోకి ప్రవేశించేసరికి.. అక్కడ గంధోక్ చాలా ప్రశాంతంగా కనిపించాడని పోలీసులు తెలిపారు. వారు లోపలికి వెళ్లి చూడగా.. బెడ్‌రూమ్‌లో రక్తంతో తడిసిన మంచాలపై కుమార్తె , భార్య మృతదేహాలు కనిపించాయి.

ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన భార్య జస్బీర్ కౌర్, కుమార్తె కమల్‌జిత్ కౌర్‌లను హత్య చేశాడు. ఆ తరువాత 12 గంటలు గడిచాక.. అంటే సోమవారం ఉదయం 8.40 గంటలకు తన పెద్ద కుమార్తె గుర్బిందర్ కౌర్ (58)కి గంధోక్ కాల్ చేసి తను చేసిన పనిని ఆమెకు చెప్పాడు. 

"గంధోక్ మాజీ సైనికుడు. ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాడు. వంటగదిలో ఉపయోగించే కత్తితో తన భార్య, కుమార్తెల గొంతు కోశాడు. దీనికి అతనేం బాధపడడం లేదు. వారి రోజువారీ అవసరాలు చూసుకోలేక, వారి బాధ చూడలేకే ఈ ఈ నేరానికి పాల్పడ్డానని పోలీసులకు తెలిపాడు’’ అని డీసీపీ(జోన్ X) మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే షేర్-ఏ-పంజాబ్ కాలనీలోనే ఉండే గుర్బిందర్ కౌర్, తన భర్త, కొడుకులతో పాటు తల్లిదండ్రులు, సోదరి ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లినట్లు పోలీసులకు తెలిపింది. "కానీ లోపల నుండి తాళం వేసి ఉంది. తలుపు తెరవడానికి మా నాన్న సిద్ధంగా లేడు. నేను అరిచాను.. కానీ కాసేపు ఎవరూ స్పందించలేదు. తరువాత, మా నాన్న మమ్మల్ని పోలీసులను పిలవమని అడిగారు. వారు వచ్చాక మాత్రమే తలుపు తెరిచాడు" అపి గుర్బిందర్ కౌర్ తెలిపింది.

ఎంతకీ తలుపులు తెరకవపోవడంతో గుర్బిందర్ కౌర్, ఆమె భర్త మేఘవాడి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చారు. వారిని తీసుకుని వచ్చారు. దీనిమీద మేఘ్‌వాడి పోలీసులు మాట్లాడుతూ, ‘గంధోక్ తాము వచ్చాక తలుపులు తెరిచాడని, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించినప్పుడు, చెక్క మంచంపై రక్తంతో తడిసిన బెడ్‌షీట్‌ మీద అతని కుమార్తె మృతదేహం, అదే స్థితిలో ఇనుప మంచంపై అతని భార్య మృతదేమం కనిపించిందన్నారు. 

"గంధోక్ గదిలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. గుర్బిందర్ కౌర్ తన తండ్రిని ఎందుకు అలా చేసావు అని అడిగినప్పుడు... వారి దీర్ఘకాలిక వ్యాధులను చూసుకోలేక, వారి బాధను, నొప్పిని చూడలేక అని సమాధానమిచ్చాడు, వారిని రాత్రి 8.30 గంటలకు చంపాడని, తరువాత నిద్ర పోయాడు" అని మేఘవాడి పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర కుదుప్కర్ చెప్పారు. గంధోక్‌పై భారత శిక్షాస్మృతి కింద హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. దీనిమీద మీడియాతో మాట్లాడడానికి గుర్బిందర్ కౌర్ ఇష్టం పడలేదు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌