కర్ణాటకలో ఘోర ప్రమాదం: 12మంది మృతి

Published : Jul 03, 2019, 01:15 PM ISTUpdated : Jul 03, 2019, 02:12 PM IST
కర్ణాటకలో ఘోర ప్రమాదం: 12మంది మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని  చిక్‌బల్లాపురంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.    

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని  చిక్‌బల్లాపురంలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12మంది మృతి చెందారు.  

టాటా ఏస్ వాహనం ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో  12 మంది మృతి చెందారు. చింతమణి నుండి మరుగుమల్లకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.  గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

కోలార్ నుండి చిక్‌బల్లాపూర్ వైపు బస్సు వెళ్తోంది.  టాటా ఏస్‌లో 25 మంది ప్రయాణీస్తున్నారు.  మృతి చెందిన వారిలో 12 మంది ఉన్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు క్షతగాత్రులను చింతమణి, కోలార్ ఆసుపత్రులకు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?